మార్గోవా దక్షిణ గోవాలో ఒక చిన్న పట్టణం. గోవాలోని అనేక బీచ్ లకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక పేరొందిన చర్చిలు మరియు దేవాలయాలు కలవు. ఈ ప్రదేశాన్ని ముస్లింలు కూడా ఇష్టపడతారు. షియా ఇమాం ఇస్మాయిలి ఖోజా జమత్కానా మరియు అక్వేమ్ లకు ముస్లిం పర్యాటకులు తరచుగా వస్తారు.
బెనాలిం, కోల్వా, వర్కి, బీటుల్, మజోర్డా బీచ్ లకు దగ్గరగా ఉంటుంది. కొనుగోళ్ళకు అనుకూలం. ఇక్కడి రెస్టరెంట్లలో అసలైన గోవా ఆహారాలు లభిస్తాయి. వసతి తేలికగా దొరుకుతుంది. అయిదు నక్షత్రాల హోటళ్ళైన తాజ్, లీలా , హయత్, హాలీడే ఇన్ సమీపంగా ఉంటాయి. సమీపంలోని ఫిషర్ మాన్ వార్ఫ్ కూడా చూడవచ్చు.
ఈ ప్రదేశంలో రుచికరమైన గోవా సముద్ర ఆహారాలు దొరుకుతాయి. మార్గోవాకు డబోలిం విమానాశ్రయం నుండి నేరుగా వెళ్ళవచ్చు. రైలు స్టేషన్ కలదు. వాస్కోడా గామా మరియు రాజధాని పనాజిం లనుండి రోడ్డు ప్రయాణం సౌకర్యవంతంగా చేయవచ్చు.



Click it and Unblock the Notifications