పాల వంశం మీద సాధించిన విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళుడు గంగై కొండ చోళపురం స్థాపించాడు. ఈ నగరం దాదాపు 250 ఏళ్ళ పాటు చోళ వంశ రాజధానిగా వుండేది. గంగా నదీ తీరం దాకా రాజులను ఓడించిన చోళుడి నగరం అని ఆ పదానికి అర్థం. అప్పట్లో రాజధానిగా వున్న ప్రాంతంలో ఎక్కువ భాగం ఇప్పటి దాకా లేదు. అప్పటి రాజధాని నగరం లోని శివాలయం అనుభవించిన వైభవం ఇప్పుడు నామమాత్రంగానే వుంది. తొమ్మిదేళ్ళ పాటు ఎంతో మంది కూలీలు కష్టపడి ఈ శివాలయాన్ని నిర్మించారు.
చోళుల కాలం నాటి అద్భుతమైన కళా నైపుణ్యానికి, చోళుల నిర్మాణ కౌశలానికి ఉదాహరణగా ఈ దేవాలయం ఈ నాటికీ నిలిచి వుంది. చోళులు నిర్మించిన దేవాలయం గానే కాక దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం వున్న ఏకైక దేవాలయంగా కూడా ఇది ప్రసిద్ది చెందింది. గర్భాలయం లో నాలుగు మీటర్ల ఎత్తున్న మూల విరాట్టు వుంది. ఇక్కడి గోడలపై చోళుల చరిత్రకు సంబంధించిన సూక్ష్మమైన వివరాలతో కూడిన ఇత్తడి శాసనాలు వున్నాయి – ఇవి ఏ చరిత్ర పుస్తకం చెప్పనటువంటి ఆసక్తికర వివరాలను తెలియచేస్తాయి. అందమైన చెక్కుళ్ళు, అచ్చేరువొందించే నిర్మాణాలు, ఆశ్చర్యం కలిగించే దేవాలయ వయసు (తోమ్మింది వందల ఎనభై నాలుగు ఏళ్ళ నాటిది) ఈ గంగై కొండ చోళపురాన్ని చూసి తీరవలసిన ప్రదేశంగా మారుస్తాయి.



Click it and Unblock the Notifications