ధరావి ప్రాంతం ఆసియా ఖండంలో అతి పెద్ద మురికివాడగా ఖ్యాతికెక్కింది. ఈ మాట నిజానికి దూరం కాదు. మంచి అయినా చెడు అయినా, కొంత కాలం నుండి ధరావి ప్రపంచం అంతా గుర్తించేలా ఒక్క అంశంలో అభివధ్ధి చెందుతోంది. అదే....అందరికి అందుబాటులో ఉండే లెదర్ లేదా తోలు వస్తువుల అమ్మకాలు.
మీరు ఎంతో వ్యయం చేసి నాణ్యత అంటూ బయటి ప్రదేశాలలో కొనే కంటే, తక్కువ ధరలలో ఉత్తమ నాణ్యతకల లెదర్ గూడ్స్ మీరు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. వీటి నాణ్యతలు, ఒరిజినల్ ఉత్పత్తులకంటే కూడా అమోఘంగా ఉంటాయి. ముంబైలో చాలామంది ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారు. ఈ ప్రాంత లెదర్ ఉత్పత్తులు మన్నికగలవని చెపుతారు.
మీరు ఇండియన్ కాకపోతే లేదా ఆ ప్రాంతానికి కొత్తవారని తెలిస్తే చాలు దుకాణ దారులు అధిక సొమ్ములు వసూలు చేస్తారు. కనుక మీకు తెలిసిన స్నేహితుడిని వెంట పెట్టుకు వెళ్ళండి. రతక్కువ ధరలలో ఉత్తమ నాణ్యతగల లెదర్ షాపింగ్ చేయండి.