చూర్ధార్ శిఖరం నహాన్ లో సముద్ర మాట్టానికి 3650 మీటర్ల ఎత్తున కల పర్యాటక ప్రదేశం. ఇంత ఎత్తునుండి సట్లేజ్ నది, గంగా మైదాన ప్రదేశాలు, బదరీనాథ్, చక్రత శిఖరం, సిమ్లా ల అద్భుత ప్రదేశాలని చూడవచ్చు. చూర్ధార్ పీక్ చేరేందుకు ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ మార్గం సుమారు 15 నుండి 40 కి. మీ.ల వరకు వుంటుంది. ట్రెక్కర్లు మార్గం లో వివిధ పక్క్షులు, జంతువులు చూడవచ్చు. నాథూరా, గంధురి , భావాల్, దదాహు ల నుండి వచ్చే సందర్శకులకు పర్వతారోహణకు, ట్రెక్కింగ్ కు ఇది అనుకూలం.
11965 అడుగుల ఎత్తున కల చూర్దార్ శిఖరం దక్షిణ హిమాచల్ ప్రదేశ్ లో అత్యధిక ఎత్తుకల శిఖరాలలో ఒకటి. స్థానికులు దీనిని దాని అందాలకు గాను చోర్ చాందని, అంటే చేతి మంచు గాజు అని పిలుస్తారు. హిందూ పురాణాల మేరకు రామాయణ కాలం లక్ష్మనుడి జీవితం కాపాడేందుకు దైవం హనుమాన్ సంజీవిని ఔషధాన్ని ఇక్కడ కనుగొన్నాడని చెపుతారు.