నందిహిల్స్ పర్యాటకులు బ్రిటీష్ శిల్ఫశైలి కల నెహ్రరూ నిలయాన్ని తప్పక చూడాలి. ఈ బంగళా పేరు భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట పెట్టారు. ఆయన ఈ ప్రదేశంలో కొంత సమయం గడిపారు. అప్పటి మైసూర్ కమీషనర్ సర్ మార్క్ కబ్బన్ కెసిబి కూడా వేసవిలో ఈ బంగళాలో గడిపేవాడు. అంతేకాక, నెహ్రూ నిలయంలో 1986లో సార్క్ సమావేశాలు కూడా జరిగాయి.
హోర్టి కల్చర్ శాఖ దీనిని ఒక గెస్ట్ హౌస్ గా మార్చింది. లోపలికి ఎవరికి ప్రవేశం లేదు. కాని యాత్రికులను మాత్రం లోపల కల అందమైన ఫొటోలను చూసేందుకు అనుమతిస్తారు. ఈ భవనానికి ఇరువైపులా ఆటలకు, విశ్రాంతికి తగిన సౌకర్యాలున్నాయి.



Click it and Unblock the Notifications