ఎల్లపుడూ పారే సరస్సు అమృత సరోవర్ ను పర్యాటకులు తప్పక చూడాలి. దీనినే లేక్ ఆఫ్ ఎంబ్రోసియా లేదా లేక్ ఆఫ్ నెక్టార్ లేదా తేనె సరస్సు అని కూడా అంటారు. ఈ నీటి సరస్సు ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదేశానికి నీటి సరఫరా దీనినుండే జరుగుతుంది. ఈ సరస్సులో నీరు సంవత్సరం పొడవునా ఉంటుంది. వెన్నెల రాత్రిలో సరస్సు లోని నీటి అలలు మెరుస్తూంటాయి. ఆ సమయంలో చూసి బాగా ఆనందించవచ్చు. ఈ సరస్సు రోడ్డు ప్రయాణంలో బెంగుళూరు నుండి 68 కి.మీ.ల దూరంలో చేరవచ్చు. ఈ సరస్సుకు సమీపంగా యోగ నందీశ్వర దేవాలయం, ఛబూత్ర మరియు శ్రీ ఉగ్ర నరసింహ దేవాలయం కూడా ఉన్నాయి.