హాటు శిఖరం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నరకంద పట్టణం లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 3300 మీటర్ల ఎత్తుతో, పట్టణం లోనే అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఉన్న ఈ శిఖరం, హిమాలయ శ్రేణి, దాని మంచు పర్వతాలు, దట్టమైన దేవదారు అడవులు, ఆపిల్ తోటలు మరియు ఆకుపచ్చ వరి పొలాల విహంగ వీక్షణం అందిస్తుంది.
నరకంద నుండి కేవలం 8 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ శిఖరం చేరడానికి, హైకింగ్, ఏకైక మార్గం. హాటు మాతా ఆలయం ఉన్న కారణంగా, హాటు శిఖరం ఈ ప్రాంతంలోని ఒక ప్రముఖ ధార్మిక స్థానం కూడా కలిగి ఉంది. ఆలయం కాకుండా, శిఖరం మీద, సందర్శకులు విశ్రాంతి పొంది, సేదతీరే చోటు అందించే పి.డబల్యు.డి అతిథి గృహం మరియు ఒక చెరువు ఉన్నాయి. పచ్చిక బయళ్ళతో పాటు ధుమారి మరియు జూ బాగ్ ల అద్భుతమైన దృశ్యం కూడా ఈ శిఖరం నుండి చూడవచ్చు.



Click it and Unblock the Notifications