కాలారామ్ దేవాలయం నాశిక్ లో ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయాన్ని 1794 లో గోపికాబాయ్ పేష్వా నిర్మించారు. ఇది త్రయంబకేశ్వర దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఇది కూడా ఇక్కడికి కొద్ది మైళ్ళ దూరంలో కలదు. దీని నిర్మాణం పూర్తిగా నల్లరాతితో జరిగింది.
ఈ దేవాలయం సుమారు 70 అడుగుల ఎత్తులో ఉండి శిఖరం బంగారు పూత వేసిన రాగి కలిగి ఉంటుంది. దీనిలో రాముడు, సీత లక్ష్మణుల విగ్రహాలుంటాయి. ఇక్కడే ఒక గణపతి, ఆంజనేయ మరియు విఠల దేవాలయాలు కూడా ఉంటాయి.



Click it and Unblock the Notifications