రామ్ కుండ్ సరస్సు నాశిక్ ప్రాంత ప్రధాన ఆకర్షణ. సుమారు 300 సంవత్సరాల క్రిందటి సరస్సు 1696 నాటిదిగా చరిత్ర చెపుతోంది. దీనిని చితరావ్ ఖతార్కర్ నిర్మించారు. ఈ సరస్సు సుమారు 27 మీటర్ల వెడల్పు 12 మీ. పొడవులో వ్యాపించి ఉంది.
శ్రీరాముడు, సీత ఈ సరస్సులో స్నానాలు చేశారని చెపుతారు. చనిపోయిన వారి అస్తికలను హిందువులు ఈ సరస్సులో కలిపి చనిపోయిన వారి ఆత్మలకు మోక్షం కలిగిస్తారు. ప్రసిద్ధి గాంచిన నేతలు, జవహర్లాల్ నెహ్రూ మరియు ఇందిరా గాంధీల అస్తికలు కూడా ఇక్కడ నిమజ్జనం చేశారు. రామ్ కుండ్ అనేకమంది యాత్రికులు స్నానం చేసి పవిత్రమవుతారు. నాశిక్ బస్ స్టాండ్ కు ఇది. 10 కి.మీ.ల దూరంలో కలదు.



Click it and Unblock the Notifications