Search
  • Follow NativePlanet
Share
» »శీతాకాల‌పు విహార‌యాత్ర‌కు ఖ‌ర్చులు త‌గ్గించే ఆర్థిక ప్ర‌ణాళిక‌

శీతాకాల‌పు విహార‌యాత్ర‌కు ఖ‌ర్చులు త‌గ్గించే ఆర్థిక ప్ర‌ణాళిక‌

శీతాకాల‌పు విహార‌యాత్ర‌కు ఖ‌ర్చులు త‌గ్గించే ఆర్థిక ప్ర‌ణాళిక‌

శీతాకాలం వ‌చ్చిందంటే సుదీర్ఘ వారాంతపు సెలవలేమైనా ఉన్నాయేమోనని చాలామంది ప్ర‌కృతి ప్రేమిక‌లు లెక్క‌లు వేసుకుంటూ ఉంటారు. విహారంపై వారికి ఉన్న ఆస‌క్తి అలాంటిది మ‌రి. ఒకవేళ ఒకరోజో, రెండు రోజులో మధ్యలో గ్యాప్ వస్తే ఒక్క క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా ఠ‌క్కున విహారయాత్రకు స్కెచ్ వేసేస్తారు.

బిజీ లైఫ్ నుంచి దూరంగా కొంత సేపైనా బాహ్య ప్ర‌పంచంలోకి అడుగుపెడితే బాగుంటుంద‌నేది వారి భావ‌న‌. ఇదంతా బాగానే ఉంటుంది. కానీ నిజంగానే విహారయాత్రకు బయలుదేరాలంటే.. అందుకు త‌గ్గ ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌పై కూడా ఓ లుక్కెయ్యాల్సిందే మరి.

రైలు, బస్సు టికెట్ మొదలుకుని హోటల్‌లో గదుల అద్దె, తిండీ తిప్పలు, ప్రయాణ ఖర్చులూ అన్నీ టూర్ ప్లాన్‌లో భాగంగానే ఉంటాయి. మూడు నాలుగు రోజుల ప్ర‌యాణానికి అప్పు చేసి మరీ ఏడాది పొడవునా కట్టుకుంటూ కూర్చోవడం అవసరమా అనిపిస్తే చాలా, ప్రయాణం అటకెక్కిన‌ట్లే. అయితే కొన్ని చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే.. ఇలా వెకేషన్‌ను అటకెక్కించకుండా నిశ్చింతగా తిరిగి రావొచ్చు.

ఆ ఖ‌ర్చు వృథా ఖ‌ర్చు కాదు..

ఆ ఖ‌ర్చు వృథా ఖ‌ర్చు కాదు..

మ‌న‌సుకు న‌చ్చే ప్ర‌దేశానికి విహారయాత్ర అనేది వృథా ఖర్చు కాదు. ఇది ఒకరకంగా మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన పెట్టుబడి. అందుకే నెలవారీగా మిగతా ఖర్చులు, పెట్టుబడులకు జీతంలో నుంచి కేటాయింపులు జరిపినట్లే.. దీనికి కూడా కొంత కేటాయించాలి.

విహార‌యాత్ర‌ల‌ కోసం మీ వార్షికాదాయంలో కనీసం 5 శాతం కేటాయించొచ్చు. వెసులుబాటును బట్టి 7 శాతం దాకా పక్కన పెట్టొచ్చు. అంతకు మించి మరీ 10 శాతం దాకా పెడితే.. మీ పెట్టుబడి ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.

విడిది చేసేందుకు స‌రైన ప్లాన్ అవ‌స‌రం..

విడిది చేసేందుకు స‌రైన ప్లాన్ అవ‌స‌రం..

ఈ సీజ‌న్‌లో విహార కేంద్రాల‌లో ధ‌ర‌లు అధికంగా ఉంటాయి. అయితే, సీజ‌న్ ఏదైనా సుదీర్ఘమైన సెలవులు గడిపేందుకు కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు హోటల్స్ కోసం వెతుక్కుంటూ కూర్చోకుండా... స్వల్ప చార్జీలకు ఆతిథ్యమిచ్చే హోమ్‌స్టే అవకాశాలు కూడా పరిశీలించవచ్చు.

వారాంతపు సెలవులో సైట్ సీయింగ్ లేదా ట్రెక్కింగ్ చేయదల్చుకుంటే.. ఇలాంటి హోమ్‌స్టే చౌకగాను, అనువుగాను ఉంటుంది. ఒకవేళ మీకేదైనా క్లబ్‌లో సభ్యత్వం ఉంటే.. మీరు వెళ్లే ప్రాంతాల్లో దానికి శాఖలు గానీ అనుబంధ ప్రాపర్టీలు గానీ ఉన్నాయేమో ఒకసారి పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఒక్కొక్క సందర్భంలో హాలిడే రాయితీలు లభించే అవకాశాలూ ఉంటాయన్న విషయం గమనంలో ఉంచుకోవాలి.

కొంత రాజీ పడటంలో తప్పు లేదు..

కొంత రాజీ పడటంలో తప్పు లేదు..

మీరు చేరుకోవాల‌నుకున్న ప్ర‌దేశం, టైమింగ్ లాంటి విషయాల్లో అవసరమైతే కొంత రాజీపడేందుకు వెనకాడనక్కర్లేదు. ఒకోసారి ఇలాంటి వాటి వల్ల ఊహించని కొంగొత్త అనుభవాలు ఎదురుకావొచ్చు. సెలవులు ఎక్కువ‌గా ఉన్న‌ట్ల‌యితే, హాలిడే వెకేషన్ గడిపేందుకు రెండు మూడు ప్ర‌దేశాల‌ను ప్లాన్ చేసుకోవ‌డం మంచిది. ఇది పీక్ సీజన్ క‌నుక ప‌ర్యాట‌కుల‌ రద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే, సర్వీసూ మెరుగ్గా ఉంటుంది.

ఉదాహరణకు.. గోవా వెళ్లేందుకు నవంబర్ నుంచి మార్చి దాకా రద్దీ సీజన్‌గా ఉంటుంది. డిసెంబర్ 20 నుంచి జనవరి 10 మధ్యలో రేట్లు ఒక్కసారిగా రెట్టింపయిపోతాయి. బీచ్ పక్కనే ఉండే 5 స్టార్ హోటల్, కాస్త కిలోమీటరు లోపల ఉండే 4 స్టార్ హోటల్‌లోనూ రేట్ల వ్యత్యాసం ఒకోసారి దాదాపు 50 శాతం దాకా కూడా ఉంటాయి. ఇలా ఒక్కొక్క‌టీ ప్ర‌ణాళికాబ‌ద్దంగా లెక్క‌లు వేసుకుంటే మీ శీలాకాల‌పు విహార‌యాత్ర ఎన్నో అనుభూతుల‌ను అందిస్తుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+