మొఘలుల వారసత్వానికి గౌరవ చిహ్నం.. తాజ్ మహోత్సవ్!
తాజ్ మహోత్సవ్ 2023 ప్రపంచంలోని అత్యంత అందమైన స్మారక కట్టడాలలో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో నిర్వహించబడుతుంది. ఇది భారతదేశంపు గొప్ప చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఒక అద్భుతమై అవకాశాన్ని అందిస్తుందనే చెప్పాలి. ఈ ఏడాది కూడా ఇందుకు సంబంధించి సన్నాహాలు పూర్తయ్యాయి. మరెందుకు ఆలస్యం.. తాజ్ మహోత్సవ్ విశేషాలను తెలుసుకుందాం రండి.
తాజ్ మహోత్సవ్ ప్రతి సంవత్సరం మొఘలుల కళ, సంస్కృతి మరియు సంప్రదాయాల గొప్ప వారసత్వాన్ని గౌరవించటానికి నిర్వహించబడుతోంది. తొమ్మిది రోజుల ఈ ఉత్సవంలో భారతదేశంలోని కొన్ని గొప్ప కళలు, చేతిపనులు, సంస్కృతులు, వంటకాలు, నృత్యాలు మరియు సంగీతాన్ని ప్రదర్శిస్తారు. ప్రపంచంలోని అత్యంత అందమైన స్మారక కట్టడాలలో ఒకటైన తాజ్ మహల్ సమీపంలో నిర్వహించబడే ఈ తాజ్ మహోత్సవ్ భారతదేశం యొక్క గొప్ప చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

సాంస్కృతిక కార్యక్రమాలను ఉచితంగా..
ఈ సంవత్సరం తాజ్ మహోత్సవ్ ఫిబ్రవరి 18 నుండి 27 వరకు తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టిక్కెట్టు రుసుము ఒక్కొక్కరికి రూ.50గా నిర్ణయించబడింది. అంతేకాదు, ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. విదేశీ పర్యాటకులకు టిక్కెట్టు రుసుము లేదు. పాఠశాల యూనిఫాంలో 100 మంది పాఠశాల విద్యార్థుల బృందానికి టిక్కెట్ ధర రూ.
500 కాగా, పాఠశాల విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. సాంస్కృతిక కార్యక్రమాల గ్యాలరీలో ప్రవేశించడానికి ప్రత్యేక టిక్కెట్ లేదని ఈవెంట్ సందర్శకులు గమనించాలి. తాజ్ మహోత్సవ్ టిక్కెట్లను తాజ్ మహల్‌కి అన్ని ప్రవేశద్వారాల వద్ద అందుబాటులో ఉన్న కౌంటర్ల నుండి కొనుగోలు చేయవచ్చు.

ఆత్మీయ అనుభూతులను చేరువచేసే..
వివిధ రంగాలకు చెందిన కళాకారులు తాజ్ మహోత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాలలో సాయంత్రపు సమయాన సందడి చేయనున్నారు. ఇక్కడి ప్రదర్శనలు ఎంతో ఆత్మీయ అనుభూతులను చేరువచేస్తాయి. క్లాసికల్ నుండి ఫోక్ వరకు వివిధ కళారూపాలు, స్థానిక జానపద, విదేశీ ఒపేరాలు మరియు శాస్త్రీయ మరియు ప్రసిద్ధ సినిమా పాటలు కన్నులపండగగా ప్రదర్శించబడతాయి. ఉర్రూతరూరించే సంగీత విభావలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చే కళాకారులు తమ ప్రతిభతో చూపరుల మనసును దోచేస్తారు.

కళల నుంచి క్రాఫ్ట్ వరకూ..
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 400 మంది ప్రఖ్యాత కళాకారులు తమ అద్భుతమైన కళాఖండాలను ప్రదర్శించే అవకాశాన్ని ఇక్కడ పొందుతారు. వీటిలో తమిళనాడు నుండి చెక్క/రాతి శిల్పాలు, ఈశాన్య భారతదేశం నుండి వెదురు/చెరకు కళాకృతులు, ఆగ్రా నుండి పాలరాయి మరియు జర్దోజీ రూపాలు, సహరన్‌పూర్ నుండి ఉడెన్ కళాకృతులు ఇలా చెప్పుకుంటూపోతే దేశలోని అన్ని ప్రాంతాల వృత్తినైపుణ్యాలను ఒకేచోట చూసే అవకాశన్ని కల్పిస్తుంది తాజ్ మహోత్సవ్. అంతేకాదు, ఆహార ప్రియుల స్వర్గంగా కూడా ఈ ఫెస్టివల్ ప్రసిద్ధిపొందింది. ఈ సమయంలో సందర్శకులు మనసారా ఆస్వాదించే వివిధ రకాల వంటకాలు మరియు ప్రపంచ ప్రసిద్ధ ఆహారాలను రుచి చూడవచ్చు. ఈ తాజ్ మహోత్సవ్ 1992లో ప్రారంభమైంది.
మొఘలుల గొప్ప వారసత్వాన్ని గౌరవించడం, కళాకారులకు ప్రోత్సాహం అందించడం మరియు వారి అద్భుతమైన కళాఖండాలు, హస్తకళలను అత్యంత ప్రామాణికమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.



Click it and Unblock the Notifications












