Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. హైదరాబాద్ టు కడప మధ్య ఫ్లైట్ స‌ర్వీసులు మ‌ళ్లీ ప్రారంభం..

ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. హైదరాబాద్ టు కడప మధ్య ఫ్లైట్ స‌ర్వీసులు మ‌ళ్లీ ప్రారంభం..

ప్ర‌యాణికుల‌కు ఇండిగో విమాన‌సంస్థ ఓ శుభ‌వార్త‌ను అందించింది. హైద‌రాబాద్ టు క‌డ‌ప మ‌ధ్య విమాన స‌ర్వీసులు మ‌ళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కడప ఎయిర్‌పోర్ట్ ఓ కీల‌క ప్రకటన విడుదల కూడా చేసింది. విమాన సర్వీసును మళ్లీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇండిగో వెల్ల‌డించింది. హైద‌రాబాద్ టు క‌డ‌ప మ‌ధ్య విమాన సర్వీసు పునరుద్ధరణ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇండిగో సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న..

హైదరాబాద్ నుంచి కడప మధ్య విమాన రాకపోకలు పునః ప్రారంభం కానున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కడప ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్ల‌డించారు. ఇక‌, ఇక్క‌డి నుండి ప్రతిరోజూ ఇండిగో సర్వీసులు నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ రూట్‌లో సర్వీసులు మళ్లీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఇండిగో సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల (అక్టోబర్) 27వ తేది నుంచి ఈ రూట్‌లో సర్వీసులు ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఈ సర్వీసులను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

అక్టోబర్ 27న‌..

6ఈ 7096 విమానం అక్టోబర్ 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభ‌మవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు కడప విమానాశ్ర‌యానికి చేరుకుంటుంది. ప్రతీరోజు ఇదే సమయానికి ప్ర‌యాణికుల‌కు విమానం అందుబాటులో ఉండనుంది. 6ఈ 7097 విమానం తిరుగు ప్ర‌యాణంలో అక్టోబర్ 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు కడపలో బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ సర్వీసు కూడా ప్రతిరోజూ ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండనుంది.

kadapaairservices

74 దేశీయ గమ్యస్థానాలు..

ఇండిగో నిత్యం కొత్త మార్గాలను అనుసంధానించేందుకు నిరంతరం కృషి చేస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్ నుండి కడప విమాన స‌ర్వీసులు.. ప్రస్తుతం, ఇండిగో హైదరాబాద్ నుండి కడప విమానాలతో సహా 74 దేశీయ గమ్యస్థానాలకు త‌న సర్వీసులను అందిస్తోంది. హైదరాబాద్ నుండి కడప వెళ్లాల‌నుకునేవారు లేదంటే కడప నుండి హైదరాబాద్ చేరుకోవాల‌నుకునేవారు విమానాల టికెట్లను నేరుగా వెబ్‌సైట్ లో బుక్ చేసుకోగ‌ల‌రు. లేదంటే ఇండిగో మొబైల్ యాప్ నుండి కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చ‌ని ఇండిగో ప్రకటించింది.ఈ సంద‌ర్బంగా మిగతా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడిచే విమాన సర్వీసు వివరాలను కూడా ఇండిగో సంస్థ పేర్కొంది.

కడప నుంచి విమాన స‌ర్వీసులు...

కడప టు హైదరాబాద్‌కు ప్రతిరోజు విమాన సర్వీసులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి.

కడప టు విజయవాడ టు కడపకు విమాన స‌ర్వీసులు సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి.

చెన్నైటు కడప టు చెన్నైకు విమాన స‌ర్వీసులు సోమ, బుధ, శుక్ర, ఆదివారం అందుబాటులో ఉంటాయి.

బెంగళూరు టు కడప టు బెంగళూరుకు ప్ర‌తి మంగళ, గురు, శనివారాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి.

కడప నుంచి విశాఖపట్నం తిరిగి కడప టు విశాఖ‌ట్నానికి విమాన స‌ర్వీసులు ప్ర‌తి మంగళ, గురు, శనివారాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+