Search
  • Follow NativePlanet
Share
» »ఏపీ రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు నుంచి ప‌లు కీల‌క రైళ్లు ర‌ద్దు

ఏపీ రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు నుంచి ప‌లు కీల‌క రైళ్లు ర‌ద్దు

ఒడిశాలోని బాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స ప్రెస్ ఘోర ప్రమాదానికి కార‌ణం సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోప‌మ‌ని తెలిసిందే. ఇలాంటి కార‌ణంగా మ‌రెక్క‌డా ప్ర‌మాదాల‌కు తావులేకుండా చూసుకునేందుకు భార‌తీయ రైల్వే ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. అందులో భాగంగా విజయవాడ డివిజన్‌లో పనులు ఇప్ప‌టికే మొదలుపెట్టింది. దీంతో ఆగస్టు నెలలో 32 ప్రధానమైన రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్ని రైళ్లను దారి మళ్లించేందుకు నిర్ణ‌యించారు. అందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను చూద్దాం!

Train

భార‌తీయ రైల్వే సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ‌ను ఆధునీక‌రించేందుకు కేంద్ర రైల్వే శాఖ క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. అందులో భాగంగా ప‌లు కీల‌క రైళ్ల‌ను ర‌ద్దు చేసేందుకు నిర్ణ‌యించింది. ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు 07979 విజయవాడ-భద్రాచలం, ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు 07278/07279 భద్రాచలం-విజయవాడ ఆగస్టు5వ తేదీ నుంచి 10వరకు 07575 తెనాలి-విజయవాడ, ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు 07630 తెనాలి-విజయవాడ ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు 07500 విజయవాడ-గూడూరు రైళ్లు ఉన్నాయి.

ర‌ద్దు చేసిన రైళ్ల వివ‌రాలు ఇలా..

అలాగే, ఆగస్టు 4వ తేదీ నుంచి 11వరకు 07458 గూడూరు-విజయవాడ,
ఆగస్టు5వ తేదీ నుంచి 12వరకు 07781/07782 విజయవాడ-మాచర్ల,
ఆగస్టు5వ తేదీ నుంచి 12వర‌కు 07629 విజయవాడ-తెనాలి,
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు 07464/07465 విజయవాడ-గుంటూరు ర‌ద్దు చేశారు.
అలాగే, ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు 07755/07756 గుంటూరు-విజయవాడ
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు 07755 డోర్నకల్‌-విజయవాడ
ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు 17270 నర్సాపూర్‌-విజయవాడ
ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు 07978 విజయవాడ-బిట్రగుంట
ఆగస్టు4వ తేదీ నుంచి 11వరకు 17237 బిట్రగుంట-చెన్నైసెంట్రల్‌
ఆగస్టు 4వ తేదీ నుంచి 11వరకు 17237/17238 బిట్రగుంట-చెన్నైసెంట్రల్‌
ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు 07862 విజయవాడ-నర్సాపూర్‌
ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు 17269 విజయవాడ-నర్సాపూర్‌
ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు 12713/17214 విజయవాడ-సికింద్రాబాద్‌
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు 17201/17202 గుంటూరు-సికింద్రాబాద్‌
ఆగస్టు 4వ తేదీ నుంచి 10వరకు 17329/17330 విజయవాడ-హుబ్లీ
ఆగస్టు5వ తేదీ నుంచి 11వరకు 17487/17488 విశాఖపట్నం-కడప
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు 12711/12712 విజయవాడ-చెన్నై సెంట్రల్‌

దారి మ‌ళ్లించిన రైళ్ల వివ‌రాలు..

వీటితోపాటు ఆగస్టు 5,7,8,9,10 తేదీల్లో 12077/12078 విజయవాడ-చెన్నైసెంట్రల్‌ రాయనపాడు మీదుగా మ‌రికొన్ని రైళ్ల‌ను దారి మళ్లించారు. ఆ రైళ్ల వివరాలను ప‌రిశీలిస్తే..
ఆగస్టు 2వ తేదీ నుంచి 10వరకు 12740 సికింద్రాబాద్‌-విశాఖపట్నం
ఆగస్టు 4వ తేదీ 20804 గాంధీనగర్‌-విశాఖపట్నం
ఆగస్టు7వ తేదీ 20820 ఓక-పూరి
ఆగస్టు 4,7 తేదీల్లో 12804 నిజాముద్ధీన్‌-విశాఖపట్నం
ఆగస్టు 2వ తేదీ నుంచి 10వరకు 11019 చత్రపతి శివాజీ టెర్మినల్‌-భువనేశ్వర్ ఉన్నాయి. కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని, అయితే ఈ ఇబ్బందులు తాత్కాలిక‌మేన‌ని అధికారులు చెబుతున్నారు. ప్ర‌యాణికులు ఈ విష‌యాన్ని గుర్తుంచుకుని, త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు.

More News

    Read more about: train andhra pradesh vijayawada
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+