Search
  • Follow NativePlanet
Share
» »అంబానీల‌ ప్రీ వెడ్డింగ్ వేడుక స్పాట్‌.. జామ్‌నగర్ విశేషాలెన్నో..

అంబానీల‌ ప్రీ వెడ్డింగ్ వేడుక స్పాట్‌.. జామ్‌నగర్ విశేషాలెన్నో..

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి 3 వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో జామ్‌న‌గ‌ర్ ప్రాముఖ్య‌త‌తోపాటు అక్క‌డి ప‌ర్యాట‌క విశేషాల గురించి ఔత్సాహికులు గూగుల్‌లో తెగ వెతుకులాడుతున్నారు. అందుకే, జామ్‌న‌గ‌ర్ చారిత్ర‌క నేప‌థ్యంతోపాటు అక్క‌డి ప‌ర్యాట‌క విశేషాలు మీ కోసం..

జామ్‌నగర్‌ను ఒకప్పుడు నవానగర్ అని పిలిచేవారు. ఒకప్పుడు నవానగర్ రాజ్యానికి రాజధానిగా ఉండేది. జామ్ నగర్ 1540లో జామ్ రావా జడేజా ఈ నగరాన్ని స్థాపించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు నవనగర్ రాజ్యానికి జామ్‌నగర్ రాజధానిగా ఉండేది. ఈ చారిత్ర‌క న‌గ‌రంలో ఒక్క‌రోజులో చూడ‌ద‌గిన ప‌ర్యాట‌క అందాలు చాలానే ఉన్నాయి. స్థానికంగా న‌గ‌ర‌ వీధుల్లోకి వెళ్లి, ఇక్క‌డి హాట్ ఫేవరెట్‌లు గతియా, ఫాఫ్దా, ఖమాన్, ఖాండ్వి, దాల్ పూరీ లేదా భాజియాతో అల్పాహారం తీసుకోవ‌డంతో మీ ప్ర‌యాణం మొద‌లుపెట్టొచ్చు.

lakhotafort1

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం

ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల జాబితాలో బాల హనుమాన్ దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆలయం 1964 నుండి కొనసాగుతున్న జై రామ్.. జై రామ్.. జై జై రాం.. అనే నాన్‌స్టాప్ జపంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. మీ చెవులలో మారు మోగుతున్న ఆ మంత్రంతో మీలోని ఆధ్యాత్మికచింత‌న మ‌న‌సును పుల‌క‌రించేలా చేస్తుంది. ఈ ఆల‌య ద‌ర్శ‌న అనంత‌రం ఇక్కడ నుండి మీరు హనుమంతునికి అంకితం చేయబడిన మరొక ఆలయానికి చేరుకోవ‌చ్చు. ఇది రాజవంశస్థులు నిర్మించిన భిద్ భంజన్ హనుమాన్ దేవాలయం. అలాగే, కెవి రోడ్‌కి వెళ్లి కాశీ విశ్వనాథ ఆలయాన్ని చూసి, నీలకంఠ మహాదేవ్ ఆలయం వద్ద శివ భగవానుని దర్శనం కోసం టౌన్ హాల్‌కు వెళ్లాలి.

నైపుణ్యానికి స‌జీవ సాక్ష్యాలు..

అక్క‌డి నుంచి అద్భుతమైన జైన శిల్పకళ ఉన్న చండీ బజార్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్క‌డ‌ 1612లో నిర్మించిన‌ వర్ధమాన్ షా యొక్క జైన దేవాలయంలోకి అడుగు పెట్టండి. ఇందులో పెద్ద ప్రధాన దేరాసర్‌లోపాటు 52 మినీ డెరిస్ లేదా వివిధ జైన తీర్థంకరులకు అంకితం చేయబడిన చిన్న దేవాలయాలు ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇక్కడ ఉన్న పాలరాతి శిల్పాలు, మిరిమెట్లు గొలిపే తోరణాలు, గోపురాలు మీ చూపును తిప్పుకోనీయ‌కుండా చేస్తాయి. అల‌నాటి క‌ళాకారుల‌ నైపుణ్యానికి అడుగ‌డుగునా క‌నువిందు చేసే రంగుల కుడ్యచిత్రాలు స‌జీవ సాక్ష్యాలుగా క‌నిపిస్తాయి.

balahanumantempleinjamnagar

లఖోటా కోట విశేషాలు..

దర్బార్‌ఘర్ పాలకుల పాత రాజ నివాసం జామ్‌న‌గ‌ర్‌లో త‌ప్ప‌కుండా చూడాల్సిన ప‌ర్యాట‌క ప్ర‌దేశం. దీని లోప‌ల మీరు భారతీయ, యూరోపియన్ శైలుల సమ్మేళనమైన చక్కటి నిర్మాణాన్ని చూడొచ్చు. అలంకారమైన అద్దాలు, ఎంతో నైపుణ్యంతో చెక్కిన స్తంభాలు, గోపురాలు, శిల్పాలు మిమ్మల్ని స‌రికొత్త ప్ర‌పంచంలో అడుగుపెట్టిన అనుభూతిని అందిస్తాయి. ఇక్కడ నుండి మీరు రన్మల్ సరస్సు మరియు మ్యూజియం అయిన లఖోటా కోటకు వెళతారు. ఈ కోట సరస్సు మధ్యలో ఉంది.

ఇక్క‌డ‌కు ఒక కాజ్‌వే ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యూజియంలో 9వ శతాబ్దం నుండి 18వ శతాబ్దానికి చెందిన కత్తులు, మస్కెట్లు, శిల్పాలు సంద‌ర్శ‌కుల కోసం ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచుతారు. ప్రతాప్ విలాస్ ప్యాలెస్ మరొక అందమైన రాచరిక నిర్మాణం. అయితే సందర్శకులను అనుమతించరు. జామ్‌న‌గ‌ర్‌లో షాపింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలు చండీ బజార్. వెండి మరియు బంగారు ఆభరణాలను విక్రయించే దుకాణాలతోపాటు లిండీ బజార్‌లో కొన్ని సావనీర్‌లను తీసుకోవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+