Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ఫ్లైఓవ‌ర్ నిర్మాణం..

ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ఫ్లైఓవ‌ర్ నిర్మాణం..

పెద్ద పెద్ద న‌గ‌రాల్లో, ప‌ట్ట‌ణాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు హైవేలు, ఫ్లైఓవ‌ర్ల‌ను నిర్మిస్తుంటారు. ఇక‌, హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై ప్రయాణాలు సాగించేవారికి ప్ర‌భుత్వం ఓ శుభ‌వార్త‌ను అందించనుంచి ఇక నుంచి ఎటువంటి టెన్ష‌న్ లేకుండా సాఫీగా ప్రయాణాలు సాగించొచ్చు. ఈ జాతీయ‌ రహదారిపై సూర్యాపేట జిల్లా టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి అధికారుల‌తో చర్చలు జరిపారు. త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభంచనున్నారు.

Hyderabad

కొత్త ఫ్లైఓవ‌ర్ నిర్మాణం..

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఇది ఒక‌టి. ఈ జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌తిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ రహదారి వారధిలా ఉంటుంద‌ని చెప్పొచ్చు. అయితే, నిత్యం రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జ‌రుగుతూ ఉంటాయి..ఈ క్ర‌మంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ హైవేపై కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు స‌మాయ‌త్త‌మ‌వ‌త‌న్నారు. ఇక‌, హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ప్ర‌యాణం చేసేవారికి కూడా చాలా వ‌ర‌కూ ట్రాఫిక్ క‌ష్టాలు తీరిన‌ట్ల‌వుతుంది. ప్ర‌స్తుతం హైదరాబాద్ - విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై ఇటీవ‌ల కాలంలో ట్రాఫిక్ ర‌ద్దీ భారీగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో ఒక ఫ్లైఓవ‌ర్ నిర్మించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.

Hyderabad

టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం..

ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి స‌ర్కార్ సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫ్లైఓవ‌ర్ కార‌ణంగా హైదరాబాద్ - విజ‌య‌వాడ జాతీయ‌ర‌హ‌దారిపై తరుచుగా జ‌రిగే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌మాదాలు, వాహనదారుల ఇబ్బందులను గ‌మనంలో ఉంచుకొని అక్కడ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేరకు ఆర్‌ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను క‌లిసి చ‌ర్చించారు. నిన్న (బుధ‌వారం జులై 31) అధికారులతో చర్చల అనంత‌రం వారు సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం..

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే మాత్రం ఈ జాతీయ ర‌హ‌దార‌పై వెళ్లే వాహనదారులకు యూటర్న్ కష్టాలు తప్పనున్నాయి. ఈ ఫ్లైఓవ‌ర్‌పై వాహనాల పరిమితి వేగం కూడా పెరగనుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దూసుకెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఈ జాతీయ ర‌హ‌దారి నాలుగు వ‌రుస‌లుగా ఉంది. గ‌తంలో కేవ‌లం రహదారి 2 వరసలు మాత్రమే ఉండేది. 2010లో అప్పటి ప్రభుత్వం ఈ జాతీయ‌ రహదారి కాస్త విస్తరించింది. ఇదిలా ఉండ‌గా,జాచీ రహదారి విస్తరణ కోసం అప్పట్లోనే భూమిని సేకరించారు. కానీ విస్తరణ జరగలేదు. రోడ్డు విస్తరణపై అధికారులు చర్చించారు. త్వరలోనే ఈ ఫ్లైఓర్ విస్తరణ పనులు మెుదలు కానున్నాయి.

More News

    Read more about: hyderabad vijayawada
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+