Search
  • Follow NativePlanet
Share
» »రైలు ప్రయాణికులకు శుభ‌వార్త‌... ఏపీలోని ఈ స్టేష‌న్ల‌లో ఆగ‌నున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు..

రైలు ప్రయాణికులకు శుభ‌వార్త‌... ఏపీలోని ఈ స్టేష‌న్ల‌లో ఆగ‌నున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు..

ఏపీ రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ ఓ శుభ‌వార్త‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని నాలుగు రైల్వేస్టేష‌న్ల‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను ఆపాల‌ని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దూర‌ప్రాంతాల‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనిరాష్ట్రంలోని నాలుగు కొత్త రైల్వేస్టేష‌న‌ల్లో ఆపాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు కేంద్ర‌మంత్రి ట్వీట్ చేయడం జ‌రిగింది. ఏపీలోని నాలుగురైల్వేస్టేష‌న్లతో పాటు తెలంగాణ‌లోని మ‌రికొన్ని రైల్వేస్టేష‌న్ల‌లో కూడా ఈ ట్రైన్స్ ఆగ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

ఎంతో కాలంగా ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చిన డిమాండ్‌పై తాజాగా కేంద్ర రైల్వేశాఖ స్పందించి, సానుకూల నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలోని నాలుగు స్టేషన్‌లలో ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ఆగ‌నున్నాయి. ఆ వివరాలను ఓసారి చూద్దాం. రామేశ్వరం - భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (20895/20896) రాజమండ్రిలో ఆగనుంది. హౌరా - పుదుచ్చేరి 12867/12868 నెంబ‌ర్‌గ‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రాజమండ్రిలో ఆప‌నున్నారు.

వీటితోపాటు హుబ్లీ - మైసూరు హంపి ఎక్స్‌ప్రెస్ 16591/16592 నెంబ‌ర్‌గ‌ల ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురంలో ఆప‌నున్న‌ట్లు రైల్వేశాఖ అధికారులు వివ‌రించారు. అలాగే, సికింద్రాబాద్ - రేపల్లె 17645/17646 నెంబ‌ర్ గ‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సిరిపురంలో ఆగనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

expresstrainsatfourstations1

ఏపీలోని నాలుగు స్టేష‌న్లు...

ఏపీలోని ఈ నాలుగు స్టేష‌న్ల‌తో పాటు తెలంగాణ‌లోని 14 స్టేష‌న్ల‌లో కూడా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల‌ను ఆపాల‌ని రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంద‌ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అవి సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే రైళ్లకు తెలంగాణలోని 14 స్టేషన్లలో అదనపు స్టాప్‌లు ఇవ్వ‌డం జ‌రిగింది. వీటిలో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోనే తొమ్మిది స్టేష‌న్లు ఉన్నాయి. తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా 17405/17406 నెంబ‌ర్ గ‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేడ్చల్‌లో ఆగ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ 12787, 12788 నెంబ‌ర్‌గ‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ మహబూబాబాద్‌లో ఆగుతుంది. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ 20701/20702 నెంబ‌ర్‌గ‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మిర్యాలగూడలో ఆగ‌నుంది. రేపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (17646) రామన్నపేటలో ఆగ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ‌లోని ప‌లు స్టేష‌న్ల‌లో ఆగ‌నున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌..

గుంటూరు-సికింద్రాబాద్‌ 17253 నెంబ‌ర్‌గ‌ల‌ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఉందానగర్‌లో ఆగుతుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి 12763 నెంబ‌ర్ గ‌ల‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెన్ నెక్కొండలో ఆగ‌నుంది. పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ మంచిర్యాలలో, దౌండ్‌-నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (11409/11410) నవీపేటలో ఆగుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. కాజీపేట-బల్లార్ష 17035/172036 నెంబ‌ర్ గ‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రాఘవాపురంలో ఆగుతుంది. బల్లార్ష-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (17035/172036) ట్రైన్ మందమర్రిలో ఆగుతుంది.

mysorehampiexpress1

సికింద్రాబాద్‌-భద్రాచలం రోడ్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ (17659/17660) తడికలపూడిలో ఆగుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం రోడ్‌-సికింద్రాబాద్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ (17660) బేతంపూడి స్టేషన్‌లో ఆగ‌నుంది. భద్రాచలంరోడ్‌-బల్లార్ష సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ (17033,17034) ట్రైన్‌ బేతంపూడిలో ఆగుతుంది. కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ (17035) ట్రైన్ రేచ్ని రోడ్‌లో ఆగుతున్న‌ట్లు కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

విశాఖ నుంచి మరో వందేభారత్ ట్రైన్‌...

వీటితోపాటు తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి మరో వందేభారత్‌ రైలును నడపడానికి సిద్ధ‌మైన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వర్‌ - విశాఖ - భువనేశ్వర్‌ (20841 - 20842) రైలును పట్టాలపైకి ఎక్కేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఈ మేరకు శుక్రవారం ట్రయల్‌ రన్ కూడా అధికారులు నిర్వహించడం జరిగింది. ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరిన వందేభారత్‌ రైలు 11 గంటలకు విశాఖకు చేరుకోనుంది.

తిరిగి మధ్యాహ్నం 3.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 9.30గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ 443 కిలోమీటర్ల దూరాన్ని 4.45 గంటల్లో చేరుకుంటుంది. ఈ ఈ ట్రైన్‌కు 8 బోగీలు ఉంటాయి. ఖుర్ధారోడ్‌, బ్రహ్మపుర, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం స్టేషన్లలో హాల్ట్‌ కల్పించారు. ఈనెల 12 నుంచి ఈ ట్రైన్ పట్టాలపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+