Search
  • Follow NativePlanet
Share
» »ఇంద్ర‌కీలాద్రీపై నేడు మహిషాసురమర్దని అలంక‌ర‌ణ‌లో అమ్మ‌వారు..

ఇంద్ర‌కీలాద్రీపై నేడు మహిషాసురమర్దని అలంక‌ర‌ణ‌లో అమ్మ‌వారు..

దేశ‌వ్యాప్తంగా ద‌స‌రా సంబురాలు అంబ‌రాన్నంటాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద‌స‌రా ఉత్స‌వాలు అంటే విజ‌య‌వాడ గుర్తొస్తుంది. ఇక్క‌డ ఇంద్రకీలాద్రిపై వెల‌సిన అమ్మ‌వారు ఎంతో మ‌హిమ‌గ‌ల‌వారు. ఇక్క‌డ న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. తొమ్మిదో రోజు శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి.

Durga Puja

ఇక‌, రేపు విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అమ్మ‌వారిని ద‌ర్శ‌నం కోసం బారులు తీరుతారు. ద‌స‌రా న‌వరాత్రుల వేళ నేడు క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలోని అమ్మ‌వారు మహిషాసుర మర్దినిదేవి అలంకరణలో భ‌క్తుల‌కు దర్శనమిస్తున్నారు. మహర్నవమి సంద‌ర్భంగా క‌నక‌దుర్గ‌మ్మ దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచి క్యూలైన్లలో బారులు తీరారు. అయితే, ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజంతా సాఫీగా దర్శనాలు సాగేలా ఆలయ అధికారులు చర్యలు చేప‌ట్టునున్నారు.

ఇంద్ర‌కీలాద్రీపై కొలువైన అమ్మ‌వారు..

శక్తిపీఠాలలో ఒకటిగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయం పేరొందింది. క‌న‌క దుర్గమ్మ కొలువైన ఈ ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల సంద‌ర్భంగా బెజవాడ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ మహిషాసుర మర్దినిదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం మహిషాసుర మర్దినిదేవి. అమ్మ‌వారు ఇక్క‌డ సింహవాహనాన్ని అధిష్ఠించి, అష్ట భుజాలతో, ఆయుధాలను ధరించి, సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా భ‌క్తుల‌కు దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే సర్వ దేవతా అనుగ్రహం కలుగుతుంద‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం...

Durga Puja

మహిషాసురమర్దని అలంక‌ర‌ణ‌లో..

మహిషాసురమర్దని అలంక‌ర‌ణ‌లో ఉన్న అమ్మవారిని ఆరాధించ‌డం వ‌ల్ల భయాలన్నీ తొలగిపోతాయనీ, సకల దోషాలు నివృత్తి అవుతాయనీ, శత్రువులపైనా, సర్వకార్యాల్లోనూ విజయం సిద్ధిస్తుందనీ భక్తుల న‌మ్మ‌కం. నేడు అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు అన్నం, పులిహోర, గారెలు, పాయసం, అప్పాలు సమర్పించాలని పండితులు చెబుతున్నారు. అమ్మ‌వారికి అలంకరించే చీర రంగు గోధుమ, ఎరుపులో ఉంటుంది. ఇక‌, అమ్మ‌వారిని తామర పువ్వుల‌తో అలంక‌రించాల‌ని తెలిపారు. శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్రం పారాయణ చేయాలని పండితులు వివ‌రించారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఆలయ అధికారులు అప్రమత్తమ‌య్యారు.

రేపు రాజ రాజేశ్వరి దేవి రూపంలో..

సామాన్య భక్తులకు దర్శనం కోసం ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఆల‌య అధికారులు త‌గు ఏర్పాట్లు చేశారు. ఆల‌యం చుట్టూ పోలీసులు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆల‌యానికి విచ్చేసే భ‌క్తుల సౌకర్యార్థం 18 చోట్ల ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. నదీ స్నానాలు కాకుండా సీతమ్మ వారి పాదాల వద్ద భారీగా షవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు భక్తుల ఆకలి తీర్చేందుకు పులిహోర, కట్టు పొంగలి, దద్దోజనం, సాంబార్ రైస్ మహామండపం ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కృష్ణానది పవిత్ర హారతుల కాణంగా దుర్గా ఘాట్ వద్దకు భక్తులకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అనంతరం క్రిష్ణా నదిలో తెప్పోత్సవ కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు. ద‌స‌రా నవరాత్రులు ముగిసిన వెంటనే అక్టోబర్12వ తేది శనివారం రోజున రాజ రాజేశ్వరి దేవి రూపంలో విజయదశమి వేడుకలను ఎంతో వైభ‌వంగా నిర్వహిస్తారు.

More News

    Read more about: navratri dussehra vijayawada
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+