Search
  • Follow NativePlanet
Share
» »Shanivar Wada: పూణేలో ఉన్న ఈ కోట మరాఠాల అద్భుతమైన చరిత్రకు నిద‌ర్శ‌నం..

Shanivar Wada: పూణేలో ఉన్న ఈ కోట మరాఠాల అద్భుతమైన చరిత్రకు నిద‌ర్శ‌నం..

దేశంలో ఎన్నో పురాత‌న క‌ట్టడాలు వాటి చ‌రిత్ర‌కు నిద‌ర్శనంగా ఉన్నాయి. అందులో మ‌హారాష్ట్రలోని అనేక కోట‌లు వాటి చారిత్ర‌క క‌థ‌నాల‌కు ఎంత‌గానో ప్రసిద్ధిచెందాయి. మ‌హారాష్ట్ర‌లోని పూణేలోని శ‌నివార్ వాడ గురించి ప్ర‌త్యేకంగా తెలుసుకోవాలి. ఈ కోట మ‌రాఠీల అద్భుతమైన చరిత్రకు సాక్షిగా చెప్పొచ్చు. ఈ కోటను పీష్వా బాజీరావు-1 నిర్మించాడు. ఈ కోట అందాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. ఈ కోటతో మరాఠా వైభవం మాత్రమే కాకుండా అనేక మోస‌పూరిత‌మైన కుట్ర‌లు దాగి ఉన్నాయి. ఈ కోట అనేక రహస్యాలతో నిండివుంది.మరి భారతదేశంలోనే అనేక కోటలు కాలక్రమంలో బండరాళ్ళుగా మిగిలిపోయాయని చెబుతుంటారు.

వాడా నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది మరాఠా కళాకారులచే క్లిష్టమైన శిల్పాలు, సున్నితమైన డిజైన్లను కలిగి ఉంది. శనివార్ వాడలో ఉత్త‌రం వైపున 21 అడుగుల పొడవైన ప్రధాన ద్వారం ఉంది. ఢిల్లీ గేట్ అని కూడా పిలువబడే ప్రసిద్ధ డిల్లీ దర్వాజా ఇక్కడి ద్వారాలలో ఒకటి. ఇక్కడ ఉన్న మరో ప్రముఖ ద్వారం మస్తానీ దర్వాజా. ఈ ద్వారాన్ని బాజీరావు సతీమణి ఉపయోగించినట్లు చెబుతారు. ఈ రెండు ద్వారాలు ఉత్తరాభిముఖంగా ఉంటాయి. ఖిడ్కి దర్వాజా తూర్పు వైపు ఉండగా, గణేష్ దర్వాజా ఆగ్నేయం వైపు ఉంది. ఇక్క‌డ అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌దేశాలున్నాయి. పదహారు రేకులతో తామరపువ్వు ఆకారంలో రూపొందించబడిన ఫౌంటెన్ ఈ వాడలో వెల‌సింది. ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్ర‌దేశంగా పేరుగాంచింది.

shanivarwada pune

ఈ కోట చరిత్ర ఏమిటి?

మరాఠా సామ్రాజ్యం యొక్క గొప్ప సైనిక నాయకుడు పీష్వా బాజీరావు-I 1736లో పూణేలో ఈ కోటను నిర్మించాడు. అక్కడ అతను తన కుటుంబం, అనుచరులతో క‌లిసి నివసించేవాడు. ఇది ప‌దమూడు అంత‌స్తుల కోట‌. ఈ కోట మరాఠా సామ్రాజ్యంలోని పీష్వాల నివాసంగా ఉండేది. బాజీరావ్ పేష్వా-1 తర్వాత అనేక తరాలు ఈ కోటలో తమ శౌర్య పతాకాన్ని ఎగురవేశారు. ఈ కోటను నిర్మించేటప్పుడు, అప్ప‌టి అధికారుల ముందున్న అతిపెద్ద లక్ష్యం భద్రత.

కోట యొక్క ప్రధాన ద్వారం ఢిల్లీ దర్వాజాగా పిలువబడుతుంది. వీటితో పాటు ఈ కోటలో గణేష్ దర్వాజా, ఖిర్కి దర్వాజా, మస్తానీ దర్వాజా, జంబల్ దర్వాజా ఉన్నాయి. ఈ కోట లోపల అనేక రాజభవనాలు నిర్మించబడ్డాయి. వీటిని ప‌ర్యాట‌కులు ఇప్ప‌టికీ చూడొచ్చు. ఈ ప్యాలెస్‌లలో గణేష్ మహల్, అర్షా మహల్, హస్తి-దంత్ మహల్, దివాన్ ఖానా వంటి అనేక ప్ర‌దేశాలున్నాయి.

shanivarwada maharashtra

ఈ కోటలో, మరాఠా సామ్రాజ్యం గొప్ప పేష్వాల అద్భుతమైన చరిత్రను చూపించేందుకు లైట్, మ్యూజిక్ షో కూడా ఉంది. వాస్తవానికి, ఈ శనివార్ వాడాలో ఒక భయానక సంఘటన ముడిపడి ఉందని స్థానికులు చెబుతుంటారు. దీని కారణంగా సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి వెళ్లడం క్రమంగా నిషేధించబడింది.

మరాఠా పదవ పీష్వాగా 18 ఏళ్ల నారాయణరావు సింహాసనాన్ని అధిష్టించినప్పుడు ఈ సంఘటన జరిగింద‌ని చెబుతుంటారు. నారాయణరావు సింహాసనం అధిష్టించడం అతని మామ రఘునాథరావుకు న‌చ్చలేద‌ని, అందువల్ల, నారాయణరావును సింహాసనం నుండి తొలగించడానికి, వారు అతనిని హత్య చేయడానికి కుట్ర పన్ని, అత‌నిని హత్య చేయబడ్డాడు. ఈనాటికీ నారాయణరావు ఆత్మ అక్కడ సంచరిస్తుందని, సహాయం కోసం ఏడుస్తుందని ఇక్క‌డివారు చెబుతుంటారు.

చేరుకోవడం ఎలా?

1828లో ఈ కోటలో భయంకరమైన అగ్నిప్రమాదం ఒక‌టి సంబ‌వించింది. ఆ తర్వాత దాని అవశేషాలు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాయి. మరాఠా సామ్రాజ్యం చ‌రిత్ర‌తోపాటు పీష్వాల పతనం కూడా ఈ ప్యాలెస్‌తో ముడిపడి ఉంది. విమాన మార్గంద్వారా ఇక్క‌డికి వెళ్లాల‌నుకునేవారు పూణే విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలి. రైలుమార్గం ద్వారా అయితే, పూణేలో రైల్వేస్టేష‌న్ ఉంది. స్టేష‌న్ నుంచి బస్సు లేదా క్యాబ్‌లో కోట‌కు చేరుకోవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+