పైకారా సరస్సు, ప్రకృతి చాలా అందమైనది అనేందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రదేశం ముడుమలై నేషనల్ పార్క్ కు 30 కి.మీ.ల దూరంలో వుంటుంది. అనేక సుందర సుందర దృశ్యాలు, పచ్చని నీరు ఈ సరస్సు అందాలను మరింత అధికం చేసాయి. నీలగిరి జిల్లాలో ఇది అతి పెద్ద సరస్సు. ఇక్కడి తోడా తెగ ప్రజలు దీనిని పవిత్ర సరస్సు గా భావిస్తారు. పైకారా లేక్ సమీపం లో కల విశాలమైన వెన్ లాక్ డౌన్స్ మైదాన ప్రదేశం స్థానికులకు, టూరిస్టులకు ఒక పిక్నిక్ ప్రదేశం. ఈ లేక్ వద్ద తమిళ్ నాడు టూరిజం శాఖ ఒక బోటు విహారం కూడా ఏర్పరచింది.
ఇక్కడే మీ ఆకలిని తీర్చేందుకు ఒక రెస్టారెంట్ కూడా కలదు. బోటు విహారం మీకు అందమైన సరస్సులో ఒక గొప్ప అవకాశం గా వుంటుంది. మెయిన్ రోడ్ పై కల ఒక బ్రిజ్ నుండి మీరు చక్కని ఫోటోలు తీయవచ్చు. పైకారా నది ఒక డాం మరియు ఒక పవర్ ప్లాంట్ కూడా కలిగి వుంది. ఈ ప్రదేశం ఉదయం 8.30 గం. నుండి సా. 5 గం వరకు పర్యాటకులకు తెరచి వుంటుంది. బోటు విహార ప్రవేశ రుసుము రూ.550 మాత్రమే. సరస్సు ప్రేవేశానికి ఎంట్రీ ఫీసు లేదు.



Click it and Unblock the Notifications