చౌరఘర్ శిఖరం సముద్ర మట్టానికి 1326 మీటర్ల ఎత్తున కలదు. పంచామారి లో ఇది ఎత్తైన శిఖరం. ఇక్కడ నుండి చుట్టూ వున్నా అడవులు, జలపాతాలు, లోయలు అద్భుతంగా చూడవచ్చు. ఇక్కడే ఒక శివాలయం కూడా కలదు. ఈ శివాలయం కు మహాశివరాత్రి నాడు వేలాది భక్తులు వస్తారు. శివుడి పై భక్తి శ్రద్ధలతో భక్తులు చిన్న త్రిశూలం చేతపట్టి వస్తారు. ఈ టెంపుల్ చేరాలంటే 1250 మెట్లు ఎక్కాలి. పైకి చేరిన తర్వాత అక్కడ కల ధర్మశాల అనే విశ్రాంతి భవనంలో సేద తీరవచ్చు. భక్తులే కాక సాహస క్రీడలు చేసే వారు సైతం ఇక్కడకు ట్రెక్కింగ్ లో వచ్చి ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications