తషి జోంగ్ మఠం కూడా పాలంపూర్ నగరంలో చూడతగ్గవాటిలో ఒకటి. ఇది రాష్ట్రంలో టిబెటన్ల శరణార్థులకు ఒక ఇల్లువంటిది. దీనియొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఇది ఒక మతపరమైన కేంద్రంగా కాకుండా, ఒక సంఘంలా కలిసికట్టుగా ఉండటం. దీనియొక్క వంపుగా ఉన్న ఫై కప్పు ఎరుపు-బంగారపు వన్నెలతో అలంకరించబడి, చూడటానికి ప్రార్ధన జెండాలు ఉన్నట్లుగా కనపడుతుంది. ఇక్కడికి తరచుగా శాంతి కోరుకునేవారు మరియు బుద్ధ భక్తులు వొస్తుంటారు. ఈ ఆలయం యొక్క గోడలు టిబెట్ సంప్రదాయ, కళలను ప్రతిబింబేచేట్లుగా అందమైన రంగులతో అలంకరించి ఉంటాయి. ఈ మఠంలోఒక అందమైన బౌద్ధ ఆధ్యాత్మిక స్మారక స్థూపం ఉండటంవలన, ఈ ఆలయం కళాత్మకంగా కనపడుతుంది.
ఇక్కడ కళా భండారంలో అనేకమైన టిబెటన్ కళాఖండాలు, గీసిన చిత్ర పటాలు మరియు వొస్తువులు చూడవొచ్చు. ఇదే కాకుండా, అందమైన తోటలు, రెస్టారెంట్లు మరియు ఈ ప్రాంతంలో ఉన్న కళా భాండాగారాలు సందర్శకులను ఆకర్షిస్తూన్నాయి.



Click it and Unblock the Notifications