పాలంపూర్ దర్శించటానికి వొచ్చిన ప్రయాణికులకు మొట్టమొదటి ఆకర్షర్ణ ఈ టీ తోటలే. ఇక్కడ టీ తోటలు ఎక్కువగా ఉండటంవలన పాలంపూర్ ను 'టీ కాపిటల్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా' అని కూడా అంటారు. ఈ టీ తోటలిని కొన్ని ఎకరాల భూమిలో పండించటం వలన, ఇక్కడ ప్రజలకు ఇది జీవనోపాధిలాగా ఉపయోగపడుతున్నది. ఈ టీ ప్లాంటేషన్ ను 19వ శతాబ్దంలో,డా. జేమ్సన్, సూపరింటెండెంట్ ఆఫ్ ది బొటానికల్ గార్డెన్స్, నార్త్-వెస్ట్ రీజియన్, ప్రారంభించారు.
ఈ టీ తోటలకు ఉన్న ప్రాచుర్యం కారణంగా, పాలంపూర్ 1883 లో ఇంటర్నేషనల్ మ్యాప్ లో నమోదు అయింది. ఇక్కడ ఎక్కువగా 'కాంగ్రా టీ' పండిస్తారు. ఇక్కడ పండించే టీని దర్బారీ, బాగేశ్వరి, బహార్ మరియు మల్హార్ అని అనేక రకాల బ్రాండ్ల పేర్లతో అమ్ముతారు. ఈ పేర్లు అన్నీ ఇండియా సంగీతానికి సంబంధించిన రాగాల పేర్లే.



Click it and Unblock the Notifications