వలియకోవిక్కల్ దేవాలయం అంచనకోవిల్ నది ఒడ్డున కలదు. పాతానం తిట్టకు ఇది. 15 కి.మీ.ల దూరం. ధర్మ శాస్తకు చెందిన ఈ వలియకోవిక్కల్ దేవాలయం పండాలం రాజులచే నిర్మించబడింది. స్వామి అయ్యప్పనే ధర్మశాస్త అని కూడా అంటారు. పంపానది ఒడ్డున ఈయననె కనుగొన్నట్లు చెపుతారు.
ఈ అయ్యప్ప స్వామి దేవాలయం, శబరిమల దేవాలయ శిల్ప తీరు తెన్నులను పోలి ఉంటుంది. యాత్రికులు ఇక్కడ ముందుగా పూజలు చేసి శబరిమలకు వెళతారు. మకరవిళక్కు కు మూడు రోజుల ముందుగా ఈ దేవాలయంలో మకరవిళక్కు ఉత్సవ పూజలు చేస్తారు. ఇది దేవాలయ ప్రధాన ఉత్సవం. ఈ ఉత్సవంలో దేవాలయ ప్రతినిధులు స్వామి అయ్యప్ప ఆభరణాలను తిరువాభరణం పేరిట ఒక ఊరేగింపులో వలియరోవిక్కల్ దేవాలయంనుండి శబరిమలకు తీసుకు వెళతారు.



Click it and Unblock the Notifications