హిందూ మత దైవం శివునికి అంకితం చేయబడిన బుద్ధ అమర్ నాథ్ ఆలయం, పట్నితోప్ యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి. మందిరం లో సహజ తెల్లరాయి తో చేసిన శివలింగం ఉంది. పుల్సత ఏటికి ఎడమవైపున ఉన్న పర్వతాల కింద భాగంలో ఉంది ఈ ఆలయం. కథానుసారం, రావణుని తాత అయిన పుల్సత యోగి ఈ నది సమీపంలో ధ్యానం చేయడం వలన నదికి అతని పేరు పెట్టబడింది.
సోదరుడు మరియు సోదరిల మధ్య బంధం కొరకు జరుపుకునే హిందూ మత పండుగ, రక్షా బంధన్ రోజు ఆలయం వద్ద భక్తుల రద్దీ చూడవచ్చు. బుద్ధ అమర్ నాథ్ దేవాలయం పట్నితోప్ వద్ద తప్పక చూడవలసినది గా పరిగణించబడుతుంది. పర్యాటకులు బస్సులలో గానీ జీప్ లో గానీ ఆలయం చేరుకోవడానికి వీలు ఉంది.



Click it and Unblock the Notifications