పాపానాధ దేవాలయం విరూపాక్ష దేవాలయానికి దక్షిణంగా ముక్తేశ్వరుడి కొరకు నిర్మించబడిని చిన్న దేవాలయం. ఈ నిర్మాణం సుమారు క్రీ.శ 740 సంవత్సరంలో చేశారు. హాలు లోపలిభాగ ప్రవేశంలో నంది మరియు వీరభద్ర విగ్రహాలుంటాయి. పర్యాటకులు ఈ దేవాలయంలో మంటపానికి ఆధారంగా కల 16 అతి పెద్ద స్తంభాలను కూడా గమనించవచ్చు.
ఈ దేవాలయ స్తంభాలు, గోడలపై వివిధ భంగిమల మహిళా చిత్రాలు, దంపతుల చిత్రాలు చెక్కబడి ఉంటాయి. భక్తులు, ఇక్కడ శివ భగవానుడు మరియు మాత పార్వతిల విగ్రహాలతోపాటు, వారిననుసరించిన వాయిద్య కారులను కూడా దేవాలయ సీలింగ్ మరియు మండపాలపై చూడవచ్చు. దేవాలయంలో చూపబడిన అద్భుత చెక్కడాలు రామాయణ, హిందూ పౌరాణిక గ్రంధాలకు సంబంధించిన ప్రధాన సంఘటనలుగా ఉంటాయి.
దేవాలయానికి ప్రవేశ ద్వారం, సభా మంటపం, అర్ద మండపం, గర్భగ్రిహం, ప్రదక్షిణల మార్గం కూడా ఉంటాయి. ఇక్కడ విశేషం ఏమంటే, సభా మండపంలో గల ఒక పెద్ద నంది. ఈ దేవాలయ చెక్కడాలు తప్పక చూడవలసిన అంశాలుగా పర్యాటకులను పట్టడకాల్ కు ఆహ్వానిస్తూంటాయి.



Click it and Unblock the Notifications