Search
  • Follow NativePlanet
Share

పౌరీ - సుందరమైన పర్యాటక కేంద్రం !

19

పౌరీ సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తులో ఉన్న సుందరమైన పర్యాటక కేంద్రం. ఇది ఉత్తరాఖండ్ లోని పౌరీ గఢ్వాల్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్నది. దేవదారు అడవులతో నిండి, కండోలియా పర్వతాల ఉత్తర వాలులో ఉన్న ఈ స్థలం పర్యాటకులకు మంత్రముగ్దులను చేసే దృశ్యాలను అందిస్తుంది. పర్యాటకులు, బందర్ పూంచ్, జోన్లి, గంగోత్రి సమూహం, నందాదేవి, త్రిశూల్, చౌఖంబ, ఘోరి పర్వత్, హాతి పర్వత్, స్వర్గరోహిణి, జోగిన్ సమూహం, తలయ్య-సాగర్, కేదార్నాథ్, సుమేరు మరియు నీలకంఠ వంటి మంచుతో కప్పబడిన పర్వతాల విస్తృత దృశ్యాలను చూడవచ్చు. అలకానంద మరియు నాయర్ ఈ జిల్లా లోని ప్రధాన నదులు.

ఈ ప్రాంతం వివిధ దేవాలయాలు, వీక్షణా స్థలాలు మరియు వనభోజన ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. హిమాలయ శిఖరాలు మరియు హిమానీనదాల దృశ్యాలు అందించే చౌఖంబ పర్యాటకులకు కన్నులపండుగ చేస్తుంది. ఖిర్సు సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉన్న మరొక ముఖ్య సందర్శనీయ పర్యాటక ప్రదేశం. నగర జీవిత రణగొణధ్వనులకు దూరంగా, పర్యాటకులకు ఆహ్లాదమైన పక్షుల కిలకిలారావాలు మాత్రమే వినిపించే ప్రశాంత ప్రదేశం. పౌరీ నుండి 16 కి.మీ.ల దూరంలో ఉన్న ధారి దేవి కూడా సందర్శించవచ్చు. ఇది ధారి దేవతకు అంకితం చేయబడిన పుణ్యక్షేత్రం. అదనంగా, పర్యాటకులు ఆది శంకరాచార్య నిర్మించిన మహా శివునికి అంకితం చేయబడిన పురాతన మహాదేవ్ ఆలయం కూడా సందర్శించవచ్చు.

దూధతోలి సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన పర్యాటక కేంద్రం. ఇక్కడ కండోలియా ఆలయం, సిద్ధిబలి ఆలయం, శంకర్ మఠం, కేషోరి మఠం మరియు జ్వల్ప దేవి ఆలయం వంటి అనేక సందర్శించదగ్గ మందిరాలు ఉన్నాయి. పర్యాటకులు లల్ధాంగ్, అద్వానీ, కోట్ ద్వారా, తారా కుండ్, భారత్ నగర్ మరియు శ్రీనగర్ వంటి ప్రముఖ ప్రదేశాలు కూడా సందర్శించవచ్చు. దేవల్ మరియు కంద వంటి ప్రాంతాలు కొన్ని పురాతన ఆలయాలను సందర్శించే అవకాశాన్ని అందిస్తాయి.

చేపల వేట మరియు సైక్లింగ్ పౌరీలో ప్రజాదరణ పొందిన కార్యకలాపాలు. నాయర్ నది లోని ఈతని కూడా ఆస్వాదించవచ్చు. పర్యాటకులు వాయు, రైలు మరియు రహదారి మార్గాలలో పౌరీ చేరుకోవచ్చు. 155 కి.మీ.ల దూరంలో డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం పౌరీ సమీప వైమానిక స్థావరం. పౌరీ చేరడానికి టాక్సీలు లభించే కోట్ ద్వారా సమీప రైల్వే స్టేషన్. పౌరీ, బస్సుల ద్వారా పొరుగు నగరాలు రుషికేష్, హరద్వార్, డెహ్రాడూన్ మరియు మసూరీ తో అనుసంధానించబడింది. వాతావరణం ఆహ్లదకరంగా ఉండే మార్చి నెల నుండి నవంబర్ నెల వరకు పౌరీ ప్రయాణానికి ఉత్తమ సమయం.

పౌరీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పౌరీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పౌరీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పౌరీ

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: పర్యాటకులు అనుకూలమైన బస్సు సేవల ద్వారా రహదారిలో పౌరీ చేరుకోవచ్చు. పౌరీ మరియు రుషికేష్ మధ్య ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్య బస్సులు నడపబడుతున్నాయి. హరద్వార్, డెహ్రాడూన్ మరియు మసూరీ పట్టణాలు కూడా పౌరీ కు బస్సు సేవలు అందిస్తున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ పౌరీ నుండి 80 కి.మీ.ల దూరంలో కోట్ ద్వారా వద్ద ఉంది. ఈ రైల్వే స్టేషన్ తరచు రైళ్ళతో దేశంలోని ప్రధాన నగరాలకు కలపబడింది. ఈ స్టేషన్ నుండి పౌరీకి టాక్సీలు సహేతుకమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం: పౌరీ జిల్లాలో విమానాశ్రయం లేదు; జిల్లా నుండి 155 కి.మీ.ల దూరంలో ఉన్న డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీప విమానాశ్రయంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ పర్యాటకులు పౌరీ నుండి 300 కి.మీ.ల దూరంలో ఉన్న కొత్త ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణించవచ్చు. ఈ విమానాశ్రయం తరచు విమానాలతో భారతదేశం యొక్క ప్రధాన నగరాలకు కలపబడింది. జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి పౌరీకి సహేతుకమైన ధరలకు టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed