ఆరోవిల్లె నగరం, పాండిచేరి

పాండిచేరి నుండి 8 కిలోమీటర్ల  దూరంలో ఉన్న ఆరోవిల్లె ( సూర్యోదయ నగరం గా కూడా ప్రసిద్ధి), వేర్వేరు జాతీయతలు, సంస్కృతులు కలిసే ఒక నగరం. ఒక టౌన్షిప్ అయిన ఈ నగరం 50 వేర్వేరు దేశాల ప్రజలకు నివాసం, అందువలన విశ్వపట్టణంగా పరిగణిస్తారు. చక్కటి రోడ్డు మార్గాన్ని కల్గిన ఆరోవిల్లె నగర౦ సాంస్కృతిక సామరస్యానికి, సామాజిక జీవనానికి ప్రతీకగా నిలుస్తుంది.

ది మదర్ గా ఎంతో ప్రసిద్ధి చెందిన మిర్రా అల్ఫస్సా స్థాపించిన ఆరోవిల్లె నగరం 1968 వ సంవత్సరంలో శ్రీ అరబిందో సొసైటీ వారు నెలకొల్పారు. అన్ని దేశాలు, సంస్కృతులకు చెందిన స్త్రీ, పురుషులు సామరస్య౦తో జీవించడానికి విశ్వవ్యాప్త స్థలాన్ని ఏర్పాటు చేసి వారు సామరస్యాన్ని, పురోగతిని తెల్సుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ నగరాన్ని నెలకొల్పారు.

ఆరోవిల్లె నగరంలో పీస్ ఏరియా, పరిశ్రమల జోన్, రెసిడెన్షియల్ జోన్, అంతర్జాతీయ జోన్, కల్చరల్ ఏరియా, గ్రీన్ బెల్ట్ అనే వేర్వేరు మండలాలు ఉన్నాయి. ఈ నగరంలోని ముఖ్య ఆకర్షణ మాతృమందిర్ దాని నిర్మాణ వైభవం వలన పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ నగరానికి సమీపంలో ఉన్న ఆరో బీచ్ ప్రయాణీకులు, పర్యాటకులలో ఒక అద్భుతమైన ప్రత్యేక ప్రాంతంగా పేరొందింది.

Please Wait while comments are loading...