పుష్కర్ ఘాట్ రాజమండ్రి నగర సమీపంలో గోదావరినది ఒడ్డున ఉన్న ఒక స్నాన ఘట్టము. ఇది రాజమండ్రిలో ఉన్న అనేక ముఖ్యమైన స్నాన ఘట్టాలలో ఒకటి. కోటిలింగేశ్వర ఆలయం,మార్కండేశ్వరస్వామి ఆలయము మరియు అనేక పురాతన దేవాలయాలు ఈ పుష్కర్ ఘాట్ చుట్టూ ఉన్నాయి. భక్తులు ఏడాది పొడవునా ఘాట్ కు తరలి వస్తారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని ఒక నమ్మకము. అనేక ముఖ్యమైన దేవాలయాలు ఘాట్ కు సమీపంలో ఉండుట వల్ల భక్తుల మనస్సు ఆనంద పారవశ్యం లో మునిగి తేలుతుంది.



Click it and Unblock the Notifications