శ్యామలంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం రాజమండ్రి ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి.ఇక్కడ ఆలయం లో ఉన్న దేవత శ్యామలంబ.ఈ అమ్మవారిని రాజమండ్రి నగర దేవతగా పిలుస్తారు. శ్యామలంబ అమ్మవారు పార్వతీ దేవి యొక్క తొమ్మిది దైవ రూపాలలో ఒకటి. చాళుక్య సామ్రాజ్యానికి చెందిన చాళుక్య వంశం రాజు నరేంద్ర ఈ అమ్మవారిని పూజించి ఎన్నో కానుకలను సమర్పించారు. అమ్మవారు ప్రతి ఏట ఉగాది పర్వ దినం సందర్బం లో నన్ను నగరం లో కి తీసుకువెళ్ళి జాతర చెయ్యాలి అని వారి భక్తులను ఆదేశించారాణి చెపుతారు. ఆ తల్లి కోరిన విధం గానే నేడు ప్రతీ ఏట ఇక్కడ అంగ రంగ వైబవం గా అమ్మ వారి జాతర జరుగుతుంది. ఈ ఆలయంలో ఇతర పండుగలు వరుసగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల కాలంలో జరుపుకుంటారు ఇవి నవరాత్రులు మరియు కనుమ సేవా పండుగలు.



Click it and Unblock the Notifications