రెడి ఇంత ప్రసిద్ధి గాంచింది అంటే దానికి కారణం రెడి గణపతి అని చెప్పాలి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన గణేశ దేవాలయం వెనుకగల కధ మీకు ఆసక్తి మాత్రమే కాదు నమ్మశక్యం కానిదిగా కూడా ఉంటుంది.
1976 వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన ఒక ట్రక్కు డ్రైవర్ సదానంద నగేష్ కంబాలి తన ట్రక్కులో రెడి వద్ద నిద్రిస్తూ తన నిద్రలో భగవాన్ గణేశుడు తనను ఆశీర్వదిస్తున్నట్లు ,ఆ ప్రదేశంలో తవ్వకం చేయమని తాను లభిస్తానని కోరినట్లు కలగంటాడు. గణేశ భగవానుడంటే ఆ డ్రైవర్ కు అపరిమిత విశ్వాసం కనుక ఆ డ్రైవర్ అక్కడి స్ధానిక శ్రామికుల సహాయంతో సముద్రపు ఒడ్డునగల ఆ ప్రదేశాన్ని తవ్వి విగ్రహాన్ని బయటకు తీస్తాడు.
తర్వాతి పరిశోధనలలో ఆ విగ్రహం పాండవుల కాలంనాటిదిగా వెల్లడవుతుంది. కొద్దిరోజుల అనంతరం గణేశుడి వాహనం అయిన ఎలుక కూడా అదే ప్రాంతంలోని తవ్వకాలలో లభిస్తుంది. ఈ విగ్రహం 6 అడుగుల ఎత్తు మరియు 4 అడుగుల వెడల్పు కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాలయ నిర్మాణం ఆ ప్రదేశాన్ని అందాల మయం చేసింది. ప్రతి సంవత్సరం గణేశ చతుర్ధి మరియు సంకష్ట చతుర్ధి పండుగలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.



Click it and Unblock the Notifications