సన్ పూరి హిల్స్ హత్కోటి వాలీ మధ్యలో కలవు. వీటిని స్థానికులు పవిత్ర కొండలుగా భావిస్తారు. వీరు ఈ ప్రదేశాన్ని అర్ధ నారీశ్వర్ అంటారు. ఇక్కడ ఒక అందమైన టెంపుల్ నిర్మించారు. దీనిలో హిందువుల దేవత మహిషాసురమర్దిని ఒక పెద్ద రాతిపై చెక్కబడి అందంగా కనపడుతుంది.
సన్ పూరి హిల్స్ సమీపంలో మరి కొన్ని టెంపుల్స్ కలవు. స్థానికుల మేరకు వీటిని మహాభారతంలోని పాండవులు నిర్మించారని చెపుతారు. ఈ నమ్మిక మేరకు ఈ టెంపుల్స్ పాంచ్ పందూరా ఘర్దో అంటే 'పాండవుల అయిదు ఇళ్ళు' అనే పేరు సంపాదించుకున్నాయి.



Click it and Unblock the Notifications