మంజరాబాద్ ఫోర్ట్ జాతీయ రహదారి నెం.48 పై ఉంది. సకలేశ్ పూర్ వెళ్ళే పర్యాటకులు దీనిని తప్పక చూడాలి. ఆర్చీ ప్రవేశ ద్వారాలతో సముద్ర మట్టానికి 3,240 అడుగుల ఎత్తున ఈ కోట ముస్లిం శైలి శిల్ప కళను ప్రదర్శిస్తుంది. ఈ కోటను మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ నిర్మించాడు. దీనినుండి సమీపంలోని కోస్తా తీరాలను పరిశీలించేవారు. మంగుళూరు ఓడరేవును రక్షించే నిమిత్తం శత్రువులను ఎదుర్కొనటానికి, బ్రిటీష్ సైన్యాలను ఎదుర్కొనటానికి ఇక్కడ ఆయుధ గిడ్డంగులను నిర్మించారు.
మంజరాబాద్ ఫోర్ట్ కొండపై ఉంది. ఇక్కడనుండి పశ్చిమ కనుమల అందచందాలను చూడవచ్చు. ఈ కోట నిర్మాణం 1785 లో మొదలు పెట్టి 1792 లో పూర్తి చేశారు.



Click it and Unblock the Notifications