రిజ్ ప్రదేశం సిమ్లా టౌన్ మధ్యలో కలదు. ఇక్కడనుండి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. ఈ ప్రదేశం ఒక పెద్ద బహిరంగ స్థలం. పడమటి వైపున స్కాండల్ పాయింట్ కు కలుపబడి వుంటుంది. తూర్పు వైపు టూరిస్టులు షాపింగ్ చేయుటకు లక్కర్ బజార్ వుంటుంది. ఈ సైట్ లో పట్టణానికి నీరు సరఫరా చేసే పెద్ద రిజర్వాయర్ కలదు. మే నెలలో ఒక వేసవి పండుగ జరుగుతుంది. అంతేకాక వివిధ ప్రభుత్వ పండుగలు స్థానిక ఉత్సవాలు వంటివి కొత్త సంవత్సరం సందర్భంగా జరుగుతూంటాయి. ఒక అందమైన చర్చి, లైబ్రరీ మరియు అనేక విగ్రహాలు వంటివి ఈ ప్రాంత ఆకర్షణ.



Click it and Unblock the Notifications