ఈ పక్షి ప్రదేశం చూడదగినది. తుంగ నది మధ్యలో ఉంది. అనేక పక్షి జాతులుంటాయి. ఇక్కడనుండి యాత్రికులు సాక్రేబైల్ ఏనుగుల శిక్షణ క్యాంపు మరియు గాజనూర్ డ్యాం చూడవచ్చు. ఇది సుమారు 1.14 ఎకరాలలో ఉంది. ఒక మంచి పిక్ నిక్ ప్రదేశంగా ఉంటుంది. ఈ పక్షి ప్రదేశంలో ఒక వాచ్ టవర్ కూడా ఉంది. కర్నాటక ప్రభుత్వ అటవీ శాఖ ఇక్కడ బోటింగ్ సేవలనిస్తోంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా చూడవచ్చు. మందగడ్డె షిమోగాకు 30 కి.మీ. దూరం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉంది. మాలూరు రైల్వే స్టేషన్ 11 కి.మీ. దూరంలో ఉంటుంది. మంగుళూరు విమానాశ్రయం దీనికి దగ్గర. ఇక్కడకు క్యాబ్ లు ఇతర వాహనాలలో షిమోగా లేదా తీర్ధ హళ్ళి నుండి చేరవచ్చు.



Click it and Unblock the Notifications