కర్నాటకలోని ప్రఖ్యాత అడవి జంతు ప్రదర్శనాలయాలలో ఇది ఒకటి. ఇది 385 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. నవంబర్ నుండి డిసెంబర్ వరకు సందర్శనకు అనుకూలం. దీనిలో కొన్ని మానవుల నివాసాలు కూడా ఉండటం విశేషం. ఎన్నో రకాల జంతువులు, పక్షులు, ఉన్నాయి. గుంటనక్కలు, పులులు, ఏనుగులు, చిరుతలు, మొసళ్ళు, నాగుపాములు, ఎలుగుబంటులు, ముంగీసలు, కొండ చిలువలు కూడా ఉన్నాయి. తీర్ధ హళ్ళికి ఇది 30 కి.మీ. ల దూరంలో ఉంది. షిమోగా సమీప రైలు స్టేషన్. మంగుళూరు విమానాశ్రయం దీనికి దగ్గర. బస్ సర్వీసులు లభ్యంగా ఉన్నాయి. ఈ ప్రదేశం వద్దే ప్రఖ్యాత జోగ్ ఫాల్స్ ఉన్నాయి.



Click it and Unblock the Notifications