సిర్సా నగరం, దాని పరిసరాలు మనకు ఘగ్గర్ లోయ ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వ౦ గురించి తెలియ చేస్తాయి.1967, 1968 సంవత్సాలలో ఘగ్గర్ నది సమీపంలోని 54 ప్రాంతాల్లో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఈ నగరాన్ని కనుగొన్నారు. ఇక్కడ దొరికిన అనేక అవశేషాల్లో గిన్నెలు, మూకుళ్ళు లాంటి రంగులద్దిన మట్టిపాత్రలు దొరికాయి, ఆ రంగులు రంగ మహల్ సంస్కృతికి చెందినవి.
సిర్సా లో పురావస్తు శాఖ కనుగొన్న మూడు ప్రధాన చారిత్రిక ప్రదేశాలు ఇవి :
ఆరినియన్ వాలి : సిర్సా కి దక్షిణాన 8 కిలోమీటర్ల దూరంలోని సిర్సా భద్రా రోడ్ లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వున్న పది అడుగుల ఎత్తున్న దిబ్బ లో ప్రాచీన, మధ్య యుగాల నాటి మట్టి పాత్రల ముక్కలు దొరికాయి.
సికందర్ పూర్ : సిర్సా కు తూర్పున 12 కిలోమీటర్ల దూరంలో ఒక దానికి ఒకటి మెయిలు దూరంలో వుండే రెండు దిబ్బలు. ఈ తవ్వకాల్లో భారీ నాప రాళ్ళు, ఇంద్రుడి విగ్రహం, శివుడి ఏకముఖ లింగం, మధ్య యుగాల నాటి దేవాలయం ఆనవాళ్ళు, రంగ మహల్ కాలం నాటి మట్టి పాత్రలు దొరికాయి.
సుచన్ : సిర్సా కు 16 కిలోమీటర్లు తూర్పున వున్న ఒక దిబ్బలో తొలి మధ్య యుగాల నాటి రంగ మహల్ మట్టి పాత్రలు లభ్యమయ్యాయి.