షోలాపూర్ జిల్లాలోని పక్షులను తిలకించే కేంద్రమైన మోతీ బాగ్ ను ప్రాంతీయంగా కంబర్ తలావు సరుస్సు అని కూడా అంటారు.ప్రకృతి ప్రియులు ,పక్షులను తిలకించే వారికీ ఎంతో నచ్చే మోతీ బాగ్ సరస్సు ను ఎన్నో వలస పక్షులు తమ తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేసుకొంటాయి.కంబర్ తలావులో ఒకప్పుడు అందమైన గులాబి, తెలుపు తామరలు తెలియాడేవి. షోలాపూర్ నగరపాలక సంస్థ ఈ సరస్సు శుభ్రతను, నిర్వహణను చేపట్టినప్పటి నుండి దీనిలో తామరలు అంతగా లేవు. ఈ ప్రకృతి స్వర్గపు తునక అందాన్ని పెంచడానికి ఇక్కడ గల కొన్ని తామరలు సహకరిస్తున్నాయి.



Click it and Unblock the Notifications