బి.యస్. కులకర్ణి 1971 లో కనుగొనిన బట్టమేక పిట్టల సంరక్షణ కేంద్రం నన్నాజ్ అనే పేరుతో ప్రసిద్ధ చెందింది . షోలాపూర్ జిల్లాలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం వలన ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.స్థానికంగా మల్దోక్ అనబడే భారత బట్ట మేక పిట్ట ఒక అరుదైన పక్షి. ఇది శుష్క పాక్షిక, శుష్క గడ్డి మైదానాలలో కనబడే పెద్ద తెలుపు, గోధుమ రంగులలో ఉండే పక్షి. మగ పక్షి 122 సెంటిమిటర్ ఆడ పక్షి 92 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.ఈ సంరక్షణ కేంద్రం 8500 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 14 వ శతాబ్దంలో నిర్మించిన ఒక ముస్లిం కోటను ఇక్కడ చూడవచ్చు.భారత బట్టమేక పిట్ట, సాధారణ ముంగీస, భారత నక్క, హైనా, క్రిష్ణ జింక , తోడేలు ఈ సంరక్షణకేంద్రం పరిసరాలలో కనబడే కొన్ని జంతువులు.



Click it and Unblock the Notifications