షోలాపూర్ జిల్లా లో ప్రజలకు షోలాపూర్ మునిసిపల్ కౌన్సిల్ ఒక గర్వకారణంబ్రిటిష్ వారి నుండి భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో పూర్వమే 1930 లో షోలాపూర్ మూడు రోజులు స్వంతంత్రం పొందిన నగరంగా యావత్ భారతదేశంలో నే ప్రతిష్ట పొందింది.ఈ కాలంలోనే షోలాపూర్ మునిసిపల్ కౌన్సిల్ భారత దేశంలో నే మొట్టమొదటి మునిసిపల్ కౌన్సిల్ గా ఏర్పడింది. 1930 లో భారత జాతీయ జెండాను ఈ కౌన్సిల్ భవనం లో మూడు రోజుల పాటు ఎగరవేశారు.షోలాపూర్ నకు చెందిన అనేక మంది స్వతంత్ర సమరవీరులకు నాయకత్వం వహించిన మన జాతి పిత మహాత్మాగాంధీ దీక్ష వల్ల 1930 లో వచ్చిన ఫలితమిది.షోలాపూర్ నగర కేంద్ర ప్రాంతంలో స్వాంతంత్ర్య సమరయోధుల స్మారక విగ్రహాలు నెలకొల్పారు. ఇక్కడి ప్రసిద్ధ హుతాత్మ చౌక్ నందు అమరవీరుల స్మారకం ఉంది.



Click it and Unblock the Notifications