శ్రీనగర్ లో ని అన్ని ప్రముఖ ఉద్యానవనాలలో చినార్ బాగ్ సరిక్రొత్తది. దీన్ని ఇటీవలే శ్రీనగర్ పర్యాటక శాఖ సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది. బోయెనే బాగ్ లేదా చినార్ బాగ్ హెరిటేజ్ పార్క్ అని కూడా పిలవబడే ఈ ఉద్యానవనం, పర్యాటకులకు కాశ్మీర్ సంస్కృతిని మరియు సంప్రదాయాలను ప్రదర్శించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.
ఈ ఉద్యానవనం లో ఊయలలు, దుకాణాలు మరియు సంగీత జలయంత్రాలు (ఫౌంటైన్లు) కలిగిన మూడు ద్వీపాలు ఉన్నాయి. సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే బహిరంగ నాటకశాల ఈ ఉద్యానవనం యొక్క విలక్షణ ఆకర్షణ. ఇక్కడ నిర్వహించబడే చేపల వేట, చలి మంటలు, ఈత పోటీలు వంటి చర్యలలో యాత్రికులు తలమునకలవుతారు.



Click it and Unblock the Notifications