ఈ దేవాలయం సముద్ర మట్టానికి 2697 మీటర్ల ఎత్తున కల కరిఘట్ట కొండపై కలదు. దీనిని పర్యాటకులు తప్పక చూడాలి. ఈ దేవాలయంలో వైకుంఠ శ్రీనివాసుడు లేదా విష్ణు మూర్తి 6 అడుగుల నల్లని రూపంలో దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని భ్రికు మహర్షి ప్రతిష్టించాడని చెపుతారు. మధ్యలో విష్ణు మూర్తి విగ్రహం ఉండగా పక్కన పద్మావతి అమ్మవారి విగ్రహం కూడా చూడవచ్చు.
పర్యాటకులు గరుడ విగ్రహాన్ని విష్ణు మూర్తి పాదాలను దేవాలయం వద్ద చూడవచ్చు. అదనంగా, ఒక పెద్ద కళ్యాణ మంటపం, కూడా కలదు. ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగితే జంటలకు శుభం అంటారు. పర్యాటకులు అందమైన శ్రీరంగ పట్నాన్ని, మైసూర్ ను కూడా చూడవచ్చు. కొండపైనుండి కావేరి, లోకపావని నదులు కూడా కనపడతాయి. ఈ దేవాలయాన్ని రధోత్సవం సమయంలో అంటే ఫిబ్రవరి మరియు మార్చి లలో చూడాలి.



Click it and Unblock the Notifications