ఈ స్తూపం తవాంగ్ పట్టణం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్తూప౦ ఈ ప్రాంతంలో అతిపెద్ద స్తూపం. ఈ గోర్సం చోర్తెన్ మోన్పా సన్యాసి లామా ప్రదార్ చే 12 వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిందని నమ్ముతారు. దీని అర్ధ వృత్తాకారపు గోపుర౦ మూడు డాబాలు గల పునాదిమీద ఆకాశాన్ని అ౦టినట్లు ఉంటుంది. మిద్దె దిగువ భాగాన ఉన్న నాలుగు మూలాలపై నాలుగు చిన్న స్తూపాలు కూడా అమర్చబడి ఉన్నాయి. యాత్రికులు ప్రార్ధనలు చేసుకోవడానికి ఈ స్థూపం చుట్టూ ఒక కాలిదోవ కూడా వేయబడింది.