అర్జేల్లింగ్ ఆశ్రమం తవాంగ్ పట్టణప్రాంతం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది 14 వ శతాబ్దం నుండి ఉనికిలో ఉందని నమ్ముతారు, ఇది తవాంగ్ లోని అత్యంత పురాతన ఆశ్రమాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ఆశ్రమాన్ని అర్జెన్ సాన్గ్పో నిర్మించారు, ఇది అతనిచే నిర్మించబడిన మూడు ఆశ్రమాలలో మొట్టమొదటిదిగా కూడా భావిస్తారు. అర్జేల్లింగ్ ఆశ్రమం 1683 లో జన్మించిన 6 వ దలైలామా త్సంగ్యంగ్ గ్యంత్సో పవిత్రమైన జన్మస్థలంగా భావిస్తారు. ఈయన లామా తాషి టెంజిన్ కుమారుడు, తెర్టన్ పెర్మలింగ్ప కు వారసుడు.