వారాంతపు సెలవుల్లో విడిది చేసేందుకు ఉత్తమమైన హోటళ్లు!
జోరున వర్షాలు కురుస్తున్నా.. బయట గడ్డకట్టే చలి ఉన్నా.. ఎండలు మండే రోజులైనా.. ఏ సమయంలోనైనా సందర్శించేందుకు అనువైన ప్రదేశం సిమ్లా. మరీ ముఖ్యంగా సిమ్లాలోని వైల్డ్‌ఫ్లవర్ హాల్ ఫైవ్-స్టార్ రిసార్ట్ విశ్రాంతి తీసుకోవడానికి అత్యుత్తమ ఎంపిక. ఎందుకంటే ఇక్కడి నుంచి దర్శనమిచ్చే మౌంటైన్ వ్యూ, సమృద్ధిగా లభించే సహజ కాంతి వెలుగులు స్వయంగా ఆస్వాదించాల్సిందే.
సతత హరిత చెట్లతో కూడిన అడవిని తనివితీరా వీక్షించేందుకు అనువైన ప్రదేశం ఇది. స్వచ్ఛమైన కొలను అందాలను దగ్గరగా చూస్తూ రిలాక్స్ అవ్వండి. ఇక్కడికి విహారయాత్రకు వెళ్లేవారు అడవుల్లో బైక్‌పై రైడ్ చేస్తూ, మార్గం మధ్యలో ఒక కప్పు కాఫీతో విశ్రాంతి తీసుకోండి. అంతేకాదు, చెట్ల మధ్య నుంచి చొచ్చుకువచ్చే సూర్యరశ్మిని ఆస్వాదించండి.

ITC గ్రాండ్ గోవా
గోవా భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ITC గ్రాండ్ గోవా రిసార్ట్ & స్పా ఇక్కడికి వచ్చే పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి ఉత్తమమైన ఎంపిక. ప్రైవేట్ బీచ్‌లతో అవుట్ డోర్ ప్రాంతంలో కుటుంబసమేతంగా లంచ్ చేసేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది పుట్టినరోజు, వివాహాలు వంటి వేడుకలకు అనువైన స్పాట్‌గా రూపొందించబడింది. ఇక్కడ విడిది చేసేవారు మనసుకు ఆహ్లాదాన్ని పంచే స్పా ట్రీట్‌మెంట్లు, గోల్ఫ్, సైక్లింగ్, విలువిద్య మరియు ఫిషింగ్ వంటి సరదా క్రీడలను ఆస్వాదించే అవకాశం ఉంది.

వైతిరి రిసార్ట్, వాయనాడ్
కేరళలోని వాయనాడ్ పర్వత ప్రాంతంలోని అడవి అందాలను ఆస్వాదించాలని భావించేవారికి నేరుగా పచ్చని ప్రకృతి ఆహ్వానం పలుకుతుంది. ఈ ప్రాంతం అనేక అరుదైన మొక్కలతోపాటు జంతువుల మధ్య మర్చిపోలేని క్షణాలను అనుభవించవచ్చు. ఇక్కడి విడిది చేసేందుకు వాయనాడ్‌లోని వైతిరి రిసార్ట్ ఒక స్వర్గమనే చెప్పాలి. ఇది మొదటి స్థాయి ఆయుర్వేద స్పా సేవలు మరియు అనేక ఇతర సాంప్రదాయ చికిత్సలతో గుర్తింపు పొందింది. జలపాతం పక్కన ఉన్న కొలనులోని ప్రకృతి ధ్వనులు మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తాయి. హనీమూన్ పూల్ విల్లా, ట్రీ హౌస్, పూల్ విల్లా, వైతిరి హెవెన్ వంటి అనేక రకాల కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.

ఫరియాస్ రిసార్ట్, లోనావాలా
ముంబై మరియు పూణే నివాసితులకు వారాంతపు సెలవుల విడిది కేంద్రం ఫరియాస్ రిసార్ట్. విలాసవంతమైన స్పా సేవలతోపాటు ఉత్తేజకరమైన అవుట్ డోర్ వాటర్ పార్కు సందర్శకులను ఆకర్షిస్తాయి. ఈ వాటర్ పార్క్ పిల్లలను గంటల తరబడి వినోదభరితంగా ఉంచుతుంది. ఎత్తైన ప్రదేశాలలోని సుందరమైన పరిసరాలలో స్పా, ఫైన్ డైనింగ్ మరియు లైవ్ మ్యూజిక్ పెద్దలకు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి.

ది ట్రీ హౌస్ రిసార్ట్, జైపూర్
జైపూర్‌లోని ది ట్రీ హౌస్ రిసార్ట్ చుట్టూ సైరి వ్యాలీ ఫారెస్ట్ విస్తరించి ఉంటుంది. ఇక్కడికి సమీపంలోని ఆరావళి పర్వతాల అద్భుతమైన దృశ్యాలను ఇక్కడి నుంచి ఆస్వాదించవచ్చు. చుట్టూ పచ్చని ఆకులతో నిండిన కొలనులు ఎంతో ఆకర్షిస్తాయి. విలాసవంతమైన అతిథి సూట్‌లలో మీకు అందించిన VIP ట్రీట్‌మెంట్‌ను సద్వినియోగం చేసుకోండి. డీప్ ఫ్రై మాంసాహారంతోపాటు కూరగాయలతో తయారు చేసే సరికొత్త రుచులను ఆస్వాదించవచ్చు. మీ మనస్సును, శరీరాన్ని ఉత్సాహపరిచేందుకు మసాజ్ లేదా స్పా అందుబాటులో ఉంటుంది.



Click it and Unblock the Notifications

