Search
  • Follow NativePlanet
Share
» »16 అంశాలకు ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం !

16 అంశాలకు ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం !

By Mohammad

బెంగళూరు ప్రస్తుతం "భారత దేశపు సిలికాన్ వ్యాలీ" గా పిలవబడుతున్నది. నేను చిన్నప్పుడు దీనిని "గార్డెన్ ఆఫ్ సిటీ" గా చదువుకున్నాను. నేను చిన్నప్పుడు చదువుకున్న బెంగళూరు కి ఇప్పుడున్న బెంగళూరు కి చాలా తేడా ఉంది (పదాల్లోనే కాదు ... అన్ని విధాలా).

కేవలం 10 - 15 సంవత్సరాల్లోనే బెంగళూరు మామూలు స్థాయి నుండి ఎంతో ఎత్తుకు వెళ్లిపోయింది. ఈ దశాబ్ధ కాలంలో గణనీయమైన ప్రగతి, నాగరికతను సంపాదించుకుంది. ఎన్నెన్నో పెద్ద పెద్ద కంపెనీలు, పరిశ్రమలు, విద్యాలయాలు అనేకం వెలిశాయి. పాశ్చాత్య సంస్కృతి కూడా గణనీయంగా పెరిగిందనుకోండి ..! అది వేరే విషయం.

ఇది కూడా చదవండి : బెంగళూరు నగరం ఎందుకు ఇష్టపడతారు ..!

ఇండియాలోని ఎక్కడెక్కడి నుంచో చదువుల కొరకై విద్యార్థులు, ఉద్యోగాల కోసమై నిరుద్యోగులు, బ్రతుకుదెరువు కోసం వచ్చే సాధారణ ప్రజలు ఇక్కడ కనిపిస్తుంటారు. ఈ పదేళ్ళ ప్రగతిలో బెంగళూరు ఎన్నో వైవిధ్యభరితమైన సంస్కృతిని, సంప్రదాయాలను నేర్చుకుంది. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటూ ... దేశ, విదేశీయులను సైతం ఆకట్టుకుంటున్న బెంగళూరు మహానగరంలో చేయవలసిన 16 అంశాలు గమనిస్తే ...

ఇది కూడా చదవండి : బెంగళూరు 40 పర్యాటక ప్రదేశాలు !!

వాతావరణాన్ని ఆస్వాదించండి ..

వాతావరణాన్ని ఆస్వాదించండి ..

బెంగళూరు వాతావరణం దేశంలోని ఆన్ని నగరాల కంటే భిన్నమైనది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. నేనే కాదు ఎవ్వరైనా చెప్పగలరనుకోండి..! బెంగళూరు లో ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలం వాతావరణం ఉల్లసభరితంగా ఉండి, మబ్బుల్లో విహరిస్తున్నట్టు ఉంటుంది. ఆ సమయంలో కాఫీ మరియు వేడి వంటలను తినటం మరిచిపోవద్దు ..!

ఇది కూడా చదవండి : బెంగళూరు - అపురూప ఆకర్షణలు !

చిత్ర కృప : Kalyan Chakravarthy

స్ట్రీట్ ఫుడ్

స్ట్రీట్ ఫుడ్

బెంగుళూరు నగరంలో స్ట్రీట్ ఫుడ్ గురించి ఆలోచిస్తే, మీకు వెంటనే గుర్తుకు వచ్చేది నోటి రుచులూరే మసాలా పానీ పూరీలు, మరింత రుచికర చాట్ లు. బెంగుళూరు నగరం స్ట్రీట్ ఫుడ్ కు ఫేమస్ అయిన బెస్ట్ ప్రదేశాలు కలిగి వుంది. బెంగుళూరు లో స్థానికంగా వుండే వారు, నగరానికి వచ్చే పర్యాటకులు ఈ తిండి ప్రదేశాలలో ఆహారాలను తిని ఆనందిస్తారు.

ఇది కూడా చదవండి : బెంగళూరు స్ట్రీట్ ఫుడ్ ఆహారాలు ..!

చిత్ర కృప : Ishwar

అందమైన సరస్సులు

అందమైన సరస్సులు

ఒకప్పుడు బెంగళూరు ను "సరస్సుల భూమి" అని పిలిచేవారు. ఆప్పట్లో బెంగళూరులో చాలా సరస్సులు ఉండేవి. నవీన నాగరికత, పట్టణాభివృద్ధి పేరుతో అవికాస్త కనుమరుగైపోయాయి. ప్రస్తుతం 17 మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. స్థానికంగా ఉండే ప్రజలు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, పిల్లలతో ఈ సరస్సుల వద్దకు వచ్చి హాయిని పొందుతుంటారు.

ఇది కూడా చదవండి : బెంగళూరు - మరిచిన సరస్సులు !!

చిత్ర కృప : Infoayan

చారిత్రాత్మక నగరం

చారిత్రాత్మక నగరం

బెంగళూరు చారిత్రక నగరంగా కూడా ప్రసిద్ధి చెందినది. ఎన్నో పురాతన కట్టడాలు, భవనాలు నేటికీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అలాంటి వాటిలో టిప్పూసుల్తాన్ వేసవి విడిది ఒకటి. ఇదే కాదు టిప్పూ కోట, బెంగళూరు కోట, విధాన సౌధ, దేవానహళ్ళి కోట, గవి గంగాదరేశ్వర ఆలయం ఇలా చెప్పుకోదగ్గ కొన్ని చారిత్రక ప్రదేశాలు, ఆలయాలు సైతం ఉన్నాయి.

ఇది కూడా చదవండి : బెంగళూరు - 5 చారిత్రక ప్రదేశాలు !!

చిత్ర కృప : John Hoey

షాపింగ్ వీధులు

షాపింగ్ వీధులు

బెంగళూరు షాపింగ్ కి అనుకూలంగా ఉంటూ, అన్ని రకాల వస్తువులు దొరికే విధంగా ఉంటుంది. దుస్తులు, పాదరక్షకాలు, బొమ్మలు, పుస్తకాలు ఇలా అనేకం లభిస్తాయి. ఇక్కడి షాపింగ్ వీధుల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి కె ఆర్ మార్కెట్, జయనగర 4 వ బ్లాక్, మల్లేశ్వరం, ఎం జి రోడ్, ఇంద్రనగర్ లు కొన్ని. ఈ ప్రదేశాలు మీకు అన్ని విధాలా అనువైనవి మరియు సరసమైన ధరకే దొరుకుతాయి. కొనేటప్పుడు బేరం ఆడటం మరవద్దు ..!

ఇది కూడా చదవండి : బెంగళూరు - షాపింగ్ వీధులు !

చిత్ర కృప : Ramnath Bhat

ఆధ్యాత్మికత నగరం

ఆధ్యాత్మికత నగరం

బెంగళూరు మత పరంగా ఎన్నో ప్రదేశాలను కలిగి ఉంది. వాటిలో దేవగిరి వెంకటేశ్వర ఆలయం, ఇస్కాన్ ఆలయం, జమా మసీదు, సేంట్ మేరీస్ బసిలికా చర్చి, బసవనగుడి చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒక్కో విశిష్టతను కలిగి మతసామరస్యాన్ని చాతుతున్నాయి.

ఇది కూడా చదవండి : బసవగుడి ఆలయ మరింత సమాచారం కోసం !

చిత్ర కృప : Svpdasa

బన్నెరఘట్ట జంతుప్రదర్శన శాల

బన్నెరఘట్ట జంతుప్రదర్శన శాల

బన్నెరఘట్ట జాతీయ పార్క్ ఔత్సాహికులకు, వన్య ప్రియులకు బాగుంటుంది. ఇది బెంగళూరులో ఉన్న ఆకర్షణ లలో ఒకటిగా, వారాంతపు విహారంగా ప్రసిద్ధి చెందినది. సఫారీ, జూ, సీతాకోక చిలుకల పార్క్ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

ఇది కూడా చదవండి : బన్నేరఘట్ట నేషనల్ పార్క్ మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Muhammad Mahdi Karim

ఆర్ట్ గ్యాలరీలు

ఆర్ట్ గ్యాలరీలు

బెంగళూరు నగరం సంప్రదాయాలకు నెలవు. స్వచ్ఛమైన కర్నాటక సంగీతం, ఆటలు, పాటలు, డ్యాన్స్ లు, సినిమా వేడుకలు, కచేరీలు, సన్మానాలు వంటి అనేక కార్యక్రమాలను ఆర్ట్ గ్యాలరీలు నిర్వహిస్తుంటాయి. ఆర్ట్ గ్యాలరీలలో రంగ శంకర, కె. హెచ్. కాల సౌధ, బాదామి హౌస్, సుచిత్ర ఫిల్మ్ సొసైటీ, చిత్రకళా పరిషత్ మొదలైన వాటిలో పైన పేర్కొన్న వేడుకలు ఆట్టహాసంగా జరుగుతుంటాయి. వీటిలో ప్రేక్షకులు కూర్చొని వీక్షించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : బెంగళూరు చుట్టుప్రక్కల గల ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి !

చిత్ర కృప : swaroop ch

గార్డెన్ సిటీ

గార్డెన్ సిటీ

ప్రస్తుతమైతే బెంగళూరు కాంక్రీట్ నగరంగా మారింది. అయినా నగరంలో కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ తోటలతో, అందమైన పూల మొక్కలతో, గుబురుగుబురుగా ఉన్న చెట్లతో, పచ్చిక మైదానాలతో నిండి ఉన్నాయి. బెంగళూరులో చాలా వరకు పార్క్ లు పచ్చదనాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో కబ్బన్ పార్క్, లాల్ బాగ్, కృష్ణారావు పార్క్ మరియు అనేక చిన్నా చితక పార్క్ లు ఉన్నాయి. బెంగళూరు లో ప్రతి అర కిలోమీటరు దూరంలో ఒక పార్క్ ఉంది.

ఇది కూడా చదవండి : కబ్బన్ పార్క్ మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Ajith Kumar

కాఫీ రుచి

కాఫీ రుచి

బెంగళూరు లో యువత ఇష్టపడే విధంగా కేఫ్ లు మరియు కాఫీ డే లు ఉన్నాయి. కాఫీలోని అన్ని రకాల రుచులను ఇవి మీకు అందిస్తాయి. కాఫీ డే, కాఫీ ఆన్ కాన్వాస్, బరిస్తా మరియు అనేక రకాల కేఫ్ లలో రుచికరమైన సువాసన గొలిపే కాఫీ లు లభ్యమవుతాయి. ఇవి తాగుతూ జిహ్వకు పని చెప్పండి.

చిత్ర కృప : Sandip Bhattacharya

ఉత్సాహం, ఆనందం

ఉత్సాహం, ఆనందం

బెంగళూరు పిల్లలకు, పెద్దలకు మరీ ముఖ్యంగా యువతకు ఎన్నో రకాల ఉత్సాహాలను, ఆనందాలను అందిస్తున్నది. మనసుని ఉల్లాసపరిచి మిమ్మల్ని అదో లోకంలో తీసుకొని పోయే ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వాటిలో ఫన్ వరల్డ్, వండర్ లా, ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ, లుంబినీ గార్డెన్, స్నో సిటీ, క్రేజీ వాటర్స్ వంటివి ప్రధానమైనవి. ఈ ప్రదేశాలలో మీరు కాసింత విశ్రాంతిని పొందవచ్చు. అలాగే యువత సాహస క్రీడల్లో పాల్గొని ఉత్సాహాన్ని ఆస్వాదించవచ్చు.

ఇది కూడా చదవండి : వండర్ లా సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Saad Faruque

వైవిధ్యభరితమైన ఆహారాలు

వైవిధ్యభరితమైన ఆహారాలు

బెంగళూరు లోని దర్శినీలు, పిజ్జా జాయంట్స్, మెక్‌డొనాల్డ్స్, బిర్యానీ హౌస్ లు, సబ్ వే లు మరియు థీం రెస్టారెంట్ లు నోరూరించే ఆహారాలను అందిస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల ఆహారాలు ఇక్కడ లభ్యమవుతుంటాయి. చైనీస్, కాంటినెంటల్, జపనీస్, స్పానిష్ వంటలు సైతం దొరుకుతాయి. తిండి ని బాగా ఇష్టపడే వారు ఇక్కడికి వెళ్ళి మీ నాలుకకు రుచి చూపించండి.

ఇది కూడా చదవండి : బెంగళూరు ఆహారాలు - రుచికర రెస్టారెంట్లు !!

చిత్ర కృప : Lawrence

షాపింగ్ మాల్స్

షాపింగ్ మాల్స్

నేడు చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అన్ని పట్టణాల్లో, నగరాల్లో షాపింగ్ మాల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్నది. బట్టలు కోనాలంటే షాపింగ్ మాల్, ఏదైనా అలంకార వస్తువులు కోనాలంటే షాపింగ్ మాల్, పాదరక్షకాలు కోనాలంటే షాపింగ్ మాల్ ... ఇలా అన్నింటికీ షాపింగ్ మాల్స్ జపం చేస్తున్నారు. మరి బెంగళూరు విషయానికి వస్తే వీటి ప్రభావం చెప్పనవసరం లేదు. ఆకాశమే హద్దు అన్నటు ఉంటుంది వీటి నిర్మాణం. ఇక్కడి షాపింగ్ మాల్స్ లో గరుడా, మంత్రి మాల్, ఒరియోన్ మాల్, ఫోరం మాల్ ముఖ్యమైనవి. వీటితో పాటు అనేక చిన్నా చితక మాల్స్ దర్శనమిస్తుంటాయి.

చిత్ర కృప : Kavya Bhat

మెట్రో రైళ్లు

మెట్రో రైళ్లు

ట్రాఫిక్ ను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన రవాణా సాధనం మెట్రో రైళ్లు. రోడ్డు మీద తిరిగే వాహనాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పిల్లర్ మీద ప్రయాణించే వాహనం ఈ మెట్రో రైలు. బెంగళూరు లో ఇంకా మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. అయినా కూడా కొన్ని ప్రదేశాల్లో మెట్రో రైలు పరుగులెడుతుంది. యశ్వంతపుర నుండి మంత్రి మాల్ వరకు మెట్రో రైలు రాకపోకలు సాగిస్తున్నది. ప్రయాణ చార్జీ 19 రూపాయలు మాత్రమే ..!

చిత్ర కృప : Arjuna Rao Chavala

పబ్ లు

పబ్ లు

బెంగళూరు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడింది అనటానికి కారణం పబ్ లు. బెంగళూరు లో పబ్ లు రాత్రి అయిందంటే చాలు యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. యువతరం ఈ పబ్ లలో ముఖ్యంగా వీకెండ్స్ లలో సందడి చేస్తూ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పోందుతారు. తాగే వారికి పబ్ లలో అన్నిరకాల బ్రాండ్ ల మందులు అందుబాటులో ఉంటాయి. యువత తాగి చిందులేస్తూ వారి ఒత్తిడిని అధిగమిస్తుంటారు.

చిత్ర కృప : Gopal Vijayaraghavan

సైక్లింగ్

సైక్లింగ్

బెంగళూరు నగరంలో కొన్ని మార్గాలు సైకిల్ ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయి. సైకిల్ నడపటంలో ఉత్సాహం, ఆనందం అనుభవించాలంటే, మీ స్నేహితులతో కలసి బెంగుళూరు లోని కొన్ని వీధులు ట్రయల్ బేసిస్ గా సంచరించండి. కేవలం నగరంలోనే కాక నగరం చుట్టుపట్ల కల మరి కొన్ని ప్రదేశాలను సైతం సైకిల్ పై చుట్టి రావచ్చు. మీ శారీరక ధృడత్వం పరీక్షించుకోనవచ్చు. మరో వైపు స్నేహితులతో కలసి ఖర్చులేని, కాలుష్య రహిత ప్రయాణం చేస్తూ ఆనందించవచ్చు.

ఇది కూడా చదవండి : బెంగళూరు చుట్టుప్రక్కల సైక్లింగ్ మార్గాల సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి !!

చిత్ర కృప : Raghu Mohan

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+