Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు లో తప్పక చూడవలసిన 30 ప్రదేశాలు !!

బెంగళూరు లో తప్పక చూడవలసిన 30 ప్రదేశాలు !!

బెంగళూరు అంటే గుర్తుకొచ్చేది .. సందడి సందడి గా ఉండే దుకాణాలు, వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు, ఆకాశాన్ని తాకే విధంగా నిర్మించిన కట్టడాలు , భారీ షాపింగ్ మాల్ లు ఇలా ఎన్నో. ప్రస్తుతం బెంగళూరు నగరం భారతదేశ మహా నగరాల జాబితాలో చేరిపోయింది. ఈ నగరం కర్నాటక రాష్ట్ర రాజధాని కూడా.

రెడ్ బస్ కూపన్లు : బస్ టికెట్ల మీద 40 % ఫ్లాట్ ఆఫర్ త్వరపడండి

బెంగళూరు మహానగరాన్ని 'గార్డెన్ ఆఫ్ సిటీ' అని, 'గ్రీన్ సిటీ' అని, 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా' అని మరియు 'సరస్సుల నగరం' అని ముద్దుగా పిలుస్తుంటారు. బెంగళూరు నగరానికి ఉన్న ప్రత్యేకత - ఎప్పుడు వర్షం పడుతుందో అస్సలు తెలీదు అందుకే కాబోలు ఇక్కడి ప్రజలు ఎప్పుడు చేతిలో గొడుగు పట్టుకొని కనిపిస్తుంటారు. ఈ ప్రదేశ వాతావరణం చల్లగా ఉంటుంది కనుక విదేశీయులు సైతం ఈ ప్రదేశాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. ఇంత వైవిధ్య భరిత ప్రదేశం బహుశా మనదేశంలో మరెక్కడా కనిపించదేమో..! మరి ఇంత ప్రత్యేకమైన ఈ ప్రదేశంలో గల ప్రధాన ఆకర్షణలను, మీరు ఎప్పుడూ కూడా టచ్ చేయని ప్రదేశాలను ఒక్కొక్కటిగా చూద్దాం పదండి ..!

బెంగళూరు ప్యాలెస్

బెంగళూరు ప్యాలెస్

బెంగళూరు ప్యాలెస్ నగరం నడిబొడ్దు లోని ప్యాలెస్ గార్డెన్ లో ఉన్నది. సుమారు 45000 చ. అ. గల ఈ ప్యాలెస్ ను కట్టడానికి 82 ఏండ్లు పట్టింది. ఈ ప్యాలెస్ లో దిగువ అంతస్తులో ఉండే ప్రాంగణంలో నీలిరంగు సిరామిక్ టైల్స్ పొదిగిన గ్రానైట్ సీట్లు(కుర్చీలు) రాత్రి వేళల్లో చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

Photo Courtesy: Vicky W.

బెంగళూరు ప్యాలెస్

బెంగళూరు ప్యాలెస్

పైన ఉండే అంతస్తులో రాజుగారు సభ చేసిన విశాలమైన దర్బార్ హాలు చూడవచ్చు. ఈ హాలు లో అడుగుపెట్టగానే ఆనాడు రాజులు సభ చేసే తీరు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి.ఈ ప్యాలెస్ లో సినిమా షూటింగ్ లు తరచూ జరుగుతుంటాయి. వెంకటేష్ నటించిన మసాలా అనే చిత్రంలో ఈ భవనాన్ని మనంచూస్తాం.

Photo Courtesy: Robert Slade

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్

బెంగళూరు నగరం లోనే కాక దేశంలోనే పేరుమోసిన ప్రసిద్ధ గార్డెన్ లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్. టిప్పూసుల్తాన్ దగ్గరుండి మరీ నిర్మాణం పూర్తి చేశాడంటే ఆయన ఎంతగా దీనిని ఇష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 240 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా వెయ్యికి పైగా పూల మొక్కల జాతులతో ఉన్న లాల్ బాగ్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక ఇవెంట్స్ లలో ఈ గార్డెన్ ను మరింత అందంగా తీర్చిదిద్దుతారు. ఈ గార్డెన్ లో ప్రధాన ఆకర్షణ పూల గడియారం.

Photo Courtesy: telugu native planet

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ వృక్ష సంపదతో, కలువ కొలనులతో, పచ్చిక బయళ్లతో మరియు పూల పాన్పులతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి ఉంటుంది. సంవత్సరంలోని అన్నిరోజులలో ఈ బొటానికల్ గార్డెన్ తెరిచే ఉంటారు. వాకింగ్ చేసే వారికి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరికి మరియు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరికి అనుమతిస్తారు. ఇక సందర్శనకు వచ్చే పర్యాటకుల కొరకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రవేశం కల్పిస్తారు.

లాల్ బాగ్ పూల ప్రదర్శన - అందాలు...అద్భుతాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Parshotam Lal Tandon

విధాన సౌధ

విధాన సౌధ

బెంగళూరు చూడటానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించే ప్రదేశం విధాన సౌధ. ఇది ఇటుకలతో నిర్మించిన ఒక అద్భుతమైన రాతి కట్టడం. 46 మీటర్ల ఎత్తులో ఉండే ఈ భవనం నగరంలోని ఆకాశహార్మాలలో ఒకటి. ద్రావిడ మరియు ఆధునిక నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవనం చూపరులను ఏమాత్రం నిరుత్సాహపరచదు.

Photo Courtesy: Vincent Chan

విధాన సౌధ

విధాన సౌధ

విధాన సౌధ లోకి వెళ్ళాలంటే అన్ని వైపులా నుంచి లోనికి వెళ్ళవచ్చు. మీరు ఈ భవన అందాలనూ చూడాలంటే ముఖ్యంగా సెలవు దినాల్లో చూడాలి ఎందుకంటే శని మరియు ఆదివారాలలో సాయంత్రం పూట ఈ భవనం విద్యుద్ధీపాల కాంతులతో మెరుస్తూ కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి.

బెంగుళూరు పరిసరాలు - సైకిల్ మార్గాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Thiagarajan Alagarsamy

కబ్బన్ పార్క్

కబ్బన్ పార్క్

బెంగళూరు నడిబొడ్డున ఉన్న మరొక ప్రధాన పార్క్ ఈ కబ్బన్ పార్క్. కార్పొరేషన్ కి సమీపాన ఉన్న ఈ పార్కు ను నగరం లోని అన్ని ప్రదేశాల నుంచి సులభంగా చేరుకోవచ్చు. 100 ఎకరాల నుంచి 300 ఎకరాల వరకు విస్తరించిన పార్క్ లో అనేక వృక్ష సంపద, పూల జాతులు దాగి ఉన్నాయి. దట్టమైన వెదురు వనాల మధ్య విస్తరించిన పార్కు ఉదయం , సాయంత్రం ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కబ్బన్ పార్క్ ఎప్పుడు తెరిచే ఉంటుంది. లోనికి వెళ్ళడానికి ఎటువంటి రుసుము అక్కర్లేదు.

పిల్లలతో పార్క్ కు వెళుతున్నారా ? ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Prabhu Shankar

లుంబిని పార్క్

లుంబిని పార్క్

ఏంటి ..? లుంబిని పార్క్ హైదరాబాద్ లో కదా ఉంది ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా ?? నిజమే ఇక్కడ కూడా హైదరాబాద్ లో మాదిరిగా లుంబిని పార్క్ ప్రజలని ఆకర్షిస్తుంది. బోటింగ్ కి సైతం అనుకూలంగా ఉండే ఈ పార్క్ బెంగళూరు నగరంలోని హెబ్బాల్ కి సమీపంలో ఉన్నది. ఈ పార్క్ సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ పొడవు ఉంటుంది.

Photo Courtesy: telugu native planet

లుంబిని పార్క్

లుంబిని పార్క్

బుద్దుని జన్మస్థలం పేరిట ఏర్పాటైన ఈ లుంబిని పార్క్ లో బుద్ధుని స్మారకార్ధం 25 అడుగుల ఎత్తైన విగ్రహం నెలకొల్పారు. పిల్లలు ఆడుకోవడానికి రకరకాల సాధనాలు ఉండటంతో కుటింబీకులు సైతం ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. సరసమైన ధరకే ఆహారాన్ని, తినుబండారాలను అందించే ఫుడ్ కోర్ట్ లు ఇక్కడ అనేకం ఉన్నాయి.

Photo Courtesy: Perfect510

లుంబిని పార్క్

లుంబిని పార్క్

లుంబిని పార్కు లో ఉన్న చెరువులో ప్రధాన ఆకర్షణ బోటింగ్ కాగా, పిల్లల కోసం బౌన్సీ ట్రేన్, ఆడుకోవడానికి పెద్ద మైదానం, బంగీ జంప్, బౌన్సీ రైడ్, స్పానిష్ బుల్ రైడింగ్ లాంటి ఎన్నో వినోదాత్మకమైన ఆటవిడుపులు ఉన్నాయి. ఇక్కడ కృతిమంగా తయారైన అలల కొలను తో బెంగళూరు ప్రజలకు బీచ్ లేని లోటు తీరిపోయింది.

Photo Courtesy: Suresh Babu

వికాస సౌధ

వికాస సౌధ

బెంగళూరు లో పూర్తిగా అత్యాధునిక హంగులతో నిర్మించిన మరొక కట్టడం వికస సౌధ. ఎనిమిది ఎకరాల విస్తీర్ణం లో ఉండే ఈ భవనం నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. నిర్మాణం విషయానికి వస్తే, లోపల చెక్కతో, బయటి వైపున రాతి శిల్పాలతో అందంగా తీర్చిద్దారు. ఈ భవనంలో 15 సమావేశ మందిరాలు, 350 గదులు ఉన్నాయి.

Photo Courtesy: Lalit Dalal

మోక్షం గుండా విశ్వేశ్వరయ్య మ్యూజియం

మోక్షం గుండా విశ్వేశ్వరయ్య మ్యూజియం

మోక్షం గుండా విశ్వేశ్వరయ్య మ్యూజియం నేటి భావి తారాలకు ఉపయోగపడే ఒక ప్రదర్శనశాల. ఇక్కడ టెక్నాలజీ కి సంభంధించిన హాల్లు ఎక్కువగా ఉంటాయి. సైన్స్ ఫర్ చిల్డ్రన్, ఫన్ సైన్స్ వంటి హాల్లు పిల్లల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసినారు. ఇందులో ఫుడ్ కోర్ట్, బుక్ స్టాల్ వంటివి ఉన్నాయి. జనరల్ విజిటర్స్ కి 40 రూపాయలు టికెట్టు గల ఈ మ్యూజియం దీపావళి, వినాయక చవితి తప్పనిచ్చి సంవత్సరం లోని అన్ని రోజులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటుంది.

Photo Courtesy: Amanjosan2008

కర్నాటక హైకోర్ట్

కర్నాటక హైకోర్ట్

బెంగళూరు లో రాష్ట్ర శాశన సభ, విధాన సౌధ కి ఎదురుగా ఎర్రటి ఇటుక రాళ్లతో నిర్మించిన కట్టడమే ఈ హైకోర్ట్. ఈ ప్రాంగణంలో ఉన్న భవనాన్ని అట్టర కాచేరీ అని పిలుస్తారు. అట్టర కాచేరీ అంటే 18 కార్యాలయాలు అని అర్ధం. ఈ భవనం కూడా విధ్యుద్దీప కాంతులతో రాత్రి పూట ప్రకాశిస్తుంటుంది.

Photo Courtesy: telugu native planet

వండర్ లా

వండర్ లా

బెంగళూరు నుంచి 28 కి. మీ. దూరంలో 82 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది వండర్‌ లా. ఇందులో భూమిపైన, నీటి పైన చేసే 53 సవారీలు అందుబాటులో ఉన్నాయి. సంగీతం పలికే జలధార, లేజర్ షో లు, ఫుడ్ కోర్ట్ లు, మీటింగ్ హాళ్లు, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు, పెద్దలు ఇలా ఎవ్వరైనా సరే వండర్ లా చూస్తే వావ్ ఆనక తప్పదు.

వండర్ లా మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: nanda kumar

సృజనాత్మకత ఫిల్మ్ సిటీ

సృజనాత్మకత ఫిల్మ్ సిటీ

భారతీయ థీమ్ పార్క్ రంగంలో, బెంగళూరులోని వండర్ లా కి కేవలం రెండు కిలో మీటర్ల దూరంలో ఏర్పాటైన ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ నిజంగా సృజనాత్మక ఆలోచనే. పిల్లలను, పెద్దలను అమితంగా ఆకర్షిస్తున్న ఈ థీమ్ పార్క్ ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరున్నర వరకు తెరిచి ఉంటుంది. ఒక్కో వినోదానికి ప్రవేశ రుసుము ప్రతి వ్యక్తికి కేవలం రూ. 299 గా, మొత్తం చూడాలంటే కేవలం రూ. 499 గా ఉంటుంది. ఎన్నో ఆకర్షణలు ఉన్న ఈ ఫిల్మ్ సిటీని సందర్శించినట్లయితే మిక్కిలి ఆనందం చెందుతారు.

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Rameshng

బెంగళూరు ఫోర్ట్

బెంగళూరు ఫోర్ట్

బెంగళూరు నగరం, కె. ఆర్. మార్కెట్ వద్ద ఉన్న బెంగళూరు ఫోర్ట్ చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. ఈ కోటలో టిప్పూ సుల్తాన్ సేనలు వాడిన ఫిరంగులు తారాసపడతాయి. కోటలోని ప్రాంగణం పచ్చని గడ్డి తో అందంగా పరిచారు. కోట లో ని గోడల నిర్మాణం నాటి పనితనానికి గొప్ప నిదర్శనం. ఇక్కడికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాహనాలు, బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

Photo Courtesy: Dushyant Naresh

బెంగళూరు సమ్మర్ ప్యాలెస్

బెంగళూరు సమ్మర్ ప్యాలెస్

బెంగళూరు నగరంలో బెంగళూరు ఫోర్ట్ కి సమీపంలో కాలినడకన వెళ్లేంత దూరంలో ఉంది బెంగళూరు సమ్మర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ టిప్పూ సుల్తాన్ హయాంలో వేసవి విడిదిగా ఉండేది. ఇది స్వాతంత్ర్య సంగ్రామ పోరాటంలో కీలక భూమిక పోషించింది. ప్యాలెస్ ప్రాంగణం అంతా రకరకాల అందమైన పూల మొక్కలతో, పుష్పాలతో అలంకరించబడి సువాసనాలను వెదజల్లుతూ ఉంటుంది.

Photo Courtesy: telugu native planet

బన్నెర ఘట్ట నేషనల్ పార్క్

బన్నెర ఘట్ట నేషనల్ పార్క్

ఒక ఎలుగుబంటి, ఒక సింహం లేదా ఏనుగు చూసి ఆనందించని పిల్లలు ఎవరు వుంటారు చెప్పండి? ఈ నేషనల్ పార్క్ లో ఉన్న వివిధ జంతువులను దగ్గర నుండి చూసి ఆనందించండి. ఈ పార్క్ పూర్తిగా చూసిన తర్వాత అక్కడే పక్కనే కల బటర్ ఫ్లై పార్క్ లోకి వెళ్లి, అవి వాటి సహజ వాతావరణం లో ఎంత స్వేచ్చగా విహరిస్తున్నాయో చూసి ఆనందించండి. ఈ పార్క్ ఉదయం 9 గం. నుండి సా. 5 గం. వరకూ తెరచి వుంటుంది.

బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: telugu native palnet

ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం

ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం

మీకు ఆధ్యాత్మిక ఆనందం కోరుకోనే వారైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రం తప్పని సరిగా సందర్శించాలి. బెంగళూరు నగరానికి 21 కి. మీ. దూరంలో ఉన్న ఈ కేంద్రాన్ని శ్రీ రవిశంకర్ స్థాపించారు. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని తయారుచేయడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కేంద్రంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పైన మరియు ధ్యానం పైన ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. దేశంలోనే కాక అంతర్జాతీయంగా ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది.

బెంగళూరు నగరం ఎందుకు ఇష్టపడతారో ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Madhukar B Raju

పిరమిడ్ వాలీ

పిరమిడ్ వాలీ

బెంగళూరు నగరం చుట్టూ ప్రక్కల గల కనకపుర తాలూకాలో ఈ పిరమిడ్ వాలీ ఉంది. ఇక్కడికి కార్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు మరియు ఇతర ప్రైవేట్ వాహనాల మీద మాత్రమే చేరుకోవచ్చు. మొదట్లో మైత్రేయ బుద్ధ విశ్వాలయంగా పిలవబడే దీనిని ప్రస్తుతం పిరమిడ్ వాలీ గా పిలుస్తున్నారు. ఈ కేంద్రం ప్రధాన ధ్యేయం ధ్యాన ప్రక్రియను విశ్వవ్యాప్తంగా విస్తరింపజేయడం, పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థల కేంద్రానికి కీలక స్థావరంగా పనిచేయడం.

Photo Courtesy: Vijaykumar Meti

శేషాద్రి అయ్యర్ మెమోరియల్ హాల్

శేషాద్రి అయ్యర్ మెమోరియల్ హాల్

బెంగళూరు మహానగరంలో ఉన్న కబ్బన్ పార్క్ లో శేషాద్రి అయ్యర్ మెమోరియల్ హాల్ ఉంది. ఈ హాలు ముందు భాగంలో ఉన్న గులాబీ తోట చుట్టూ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. సోమవారం నాడు మూసి ఉండే ఈ గ్రంధాలయంలో 2.65 లక్షల పుస్తకాలతో పాటుగా, బ్రెయిలీ లిపి కి చెందిన పుస్తకాలు మరియు విజ్ఞాన సంబంధిత పుస్తకాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఎరుపు రంగులో కనిపించే ఈ మెమోరియల్ హాల్ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:00 వరకు తెరిచి ఉంటుంది.

Photo Courtesy: Parshotam Lal Tandon

ఎం చిన్న స్వామి స్టేడియం

ఎం చిన్న స్వామి స్టేడియం

బెంగళూరు నగరం నడిబొడ్డున ఎం చిన్న స్వామి స్టేడియం ఉంది. కబ్బన్ పార్క్ కి సమీపంలో ఉన్న స్టేడియం దేశంలోని ప్రముఖ మైదానాలలో ఒకటి. యాభై వేల మంది ఒకేసారి కోర్చొని ఆట తిలకించే సామర్ధ్యం ఉన్న ఈ మైదానం ఇప్పటివరకు మూడు సార్లు ప్రపంచ కప్ పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది.

భారత క్రికెటర్లు - పుట్టిన ప్రదేశాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Royal Challengers Bangalore

ఇన్ఫోసిస్ ప్రాంగణం

ఇన్ఫోసిస్ ప్రాంగణం

బెంగళూరు లో మీరు హైటెక్ హంగులు చూడాలంటే, హోసూరు రోడ్డు లోని ఎలెక్ట్రానిక్స్ సిటీ లో 80 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఇన్ఫోసిస్ ప్రాంగణం తప్పక చూడాలి. ఈ ప్రాంగణం లో కెల్లా అత్యంత ఆకర్షణ గాజుతో పిరమిడ్ ఆకారంలో చేసిన నిర్మాణం. వేల మొక్కలు, చెట్లతో కూడిన ప్రాంగణం పచ్చదనంతో కప్పివేయబడింటుంది.

Photo Courtesy: telugu native planet

వృషభ ఆలయం

వృషభ ఆలయం

దొడ్డా బసవన గుడి అని పిలవబడే వృషభ ఆలయం బెంగళూరు లోని బసవనగుడి లో ఉంది. నందీశ్వరుని ఆలయాలలో కెల్ల పెద్దదైన ఈ ఆలయంలో 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉండే నంది విగ్రహాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ నంది విగ్రహం పూర్తిగా గ్రానైట్ ఒంటి రాతీలోంచి తీర్చిదిద్దారు. ఇక్కడికి చేరుకోవాలంటే పెద్దగా కష్ట పడవలసిన అవసరం లేదు. బెంగళూరు లోని అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి ప్రైవేట్ మరియు ప్రభుత్వ సర్వీసుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

Photo Courtesy: Luigi Guarino

గవి గంగాదారేశ్వర ఆలయం

గవి గంగాదారేశ్వర ఆలయం

బెంగళూరు లో ప్రజాదరణ ఉన్న ఆకర్షణలలో గవి గంగాదారేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో గర్భగుడిలో ఉన్న విగ్రహం మీద సూర్యకిరణాలు పడతాయి. ఈ మహా దృశ్యం జనవరి మాసంలో వచ్చే మకర సంక్రాంతి రోజున గంట పాటు ఉంటుంది. ఇక్కడ శివుని విగ్రహంతో పాటుగా అరుదుగా కనిపించే అగ్ని దేవుని విగ్రహం ఉన్నాయి.

Photo Courtesy: telugu native planet

ఇస్కాన్ ఆలయం

ఇస్కాన్ ఆలయం

బెంగళూరు నగరంలో ఒకప్పుడు చిన్న అద్దె ఇంట్లో ప్రారంభించిన ఇస్కాన్ ఆలయం ప్రస్తుతం పదకొండు ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇక్కడ బంగారు పూతతో ప్రతిష్టించిన ద్వజస్తంభం 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైనదిగా ప్రసిద్ధి చెందినది. బెంగళూరు లోని రాజాజీ నగర్ ప్రాంతంలో గల ఈ ప్రదేశానికి చేరుకోవడానికి బెంగళూరు నగరంలోని మెజేస్టిక్ మరియు ఇతర ప్రదేశాల నుంచి ప్రైవేట్ మరియు ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

దేశంలోని మరిన్ని ఇస్కాన్ ఆలయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: telugu native planet

శివ మందిర్

శివ మందిర్

బెంగళూరు పరిసరాలలో ఉన్న శివ మందిర్ ప్రఖ్యాతి చెందినది. ఇక్కడ 65 అడుగుల ఎత్తులో శివుని విగ్రహం ఉంది. బెంగళూరు నుంచి కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో మురుగేష్ పాల్య అనే ప్రాంతంలో ఈ మందిరం ఉంది. దీన్ని కెంప్ పోర్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడికి మెజేస్టిక్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy: Darshan Karia

హేసరగట్ట చెరువు

హేసరగట్ట చెరువు

బెంగళూరు మహా నగరానికి 18 కి. మీ. దూరంలో ఏర్పాటు చేసిన హేసరగట్ట చెరువు ఒక మానవ నిర్మిత ఆనకట్ట. ఈ ప్రదేశంలో వివిధ రకాల పక్షి జాతులు సంచరిస్తుంటాయి. అందులో కింగ్‌ఫిషర్, మైనా, పుర్పుల్ సన్ బర్డ్ వంటివి కనిపిస్తాయి. ఇక్కడ జరిగే విండ్ సర్ఫింగ్ క్రీడా చాలా మందిని ఆకర్షిస్తుంది. ఈ చెరువు వెంట ఉద్యానవనాలు, ఆక్వెరియాలు మరెన్నో ప్రదేశాలు తారాసపడతాయి.

Photo Courtesy: mM

ఉల్సూరు చెరువు

ఉల్సూరు చెరువు

బెంగళూరు మహానగరంలో రద్దీగా ఉండే ఎం జీ రోడ్డుకి కాలి నడక దూరంలో ఉల్సూరు చెరువు ఉంది. ఈ చెవులో అక్కడక్కడ దీవులు ఉంటాయి. ఈ చెరువు బోట్ షికారు కు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి బోట్ క్లబ్బు చెరువులో తిరగడానికి, మధ్యలో ఉన్న దీవులలో ఆగడానికి బోట్లు అందుబాటులో ఉంచుతుంది.

బెంగళూరు లో మరిన్ని సరస్సుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Swaminathan

వాణిజ్య వీధి

వాణిజ్య వీధి

బెంగళూరు నగరంలో బ్రిగేడ్ రోడ్డు నుంచి, కామరాజు రోడ్డు నుంచి వాణిజ్య వీధి చేరుకోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్ల దుకాణాలతో పాటుగా, ఫుడ్ కోర్ట్ లు, టీ స్టాళ్లు ఉన్నాయి. మహిళలు కొనుక్కునే వస్తువులే ఇక్కడ అధికంగా ఉంటాయి అయిన మగవారికి కూడా ఏమాత్రం బోర్ కొట్టదు. ఇక్కడ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటి ఎలెక్ట్రానిక్స్ కార్డు ముక్కలతో పని జరగదు కనుక తప్పకుండా చేతిలో నోట్ల కట్టలు (నగదు) ఉండాల్సిందే..!

Photo Courtesy: telugu native planet

మంత్రి స్క్వేర్ మాల్

మంత్రి స్క్వేర్ మాల్

బెంగళూరు లో మెజేస్టిక్ - మల్లేశ్వరం వెళ్లే మార్గం లో మంత్రి స్కేర్ మాల్ ఉంది. సుమారు లక్షన్నర చదరపు అడుగులున్న ఈ మాల్ బహుశా దేశంలో కెల్లా పెద్దది. వినోదం, షాపింగ్, ఆహారం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఎన్నో బ్రాండ్ల దుకాణాలు, మరెన్నో ఫుడ్ కోర్ట్ లు ఉన్న ఈ మాల్ రెండువేల కార్లు పట్టే సామర్ధ్యం తో, అంతులేని సంతోషాన్ని, ఆనందాన్ని మరియు వినోదాన్ని ఒకేచోట అందిస్తున్నది.

Photo Courtesy: ruben alexander

యు బి సిటీ

యు బి సిటీ

బెంగళూరులో అతి పెద్ద విలాసవంతమైన వాణిజ్య సముదాయం ఈ యు బి సిటీ. ఇక్కడ అన్ని రకాల బ్రాండ్ లు ఒకే వేదికపై దొరుకుతాయి. నాలుగు భవనాల కలయిక గల ఈ సముదాయంలో కింది అంతస్థులో చిల్లర దుకాణాలు, పై అంతస్థులో కార్యాలయాలు ఉంటాయి. ఇటాలియన్ నుంచి చైనీస్ దాకా అన్ని రకాల వంటకాలు మీరు ఇక్కడ రుచి చూడవచ్చు.

Photo Courtesy: Balaji Narayanan

బెంగళూరు వంటలు

బెంగళూరు వంటలు

బెంగళూరు మహానగరం వైవిధ్యభరిత ఆహారాలకు పెట్టింది పేరు. దేశ, విదేశాల నుంచి బెంగళూరు కి వచ్చే పర్యాటకులకి నోరూరించే వంటలను రుచి చూపిస్తుంది. ఈ ప్రదేశంలో స్ట్రీట్ ఫుడ్ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద హోటళ్ళ వరకు రకరకాల ఆహారాలను తిని ఆనందించవచ్చు.

బెంగుళూరు రెస్టారెంట్ లు - రుచికర ఆహారాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Siddharth Dasari

వాయు మార్గం

వాయు మార్గం

బెంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశీయ, అంతర్జాతీయ నగరాలకు పేరుమోసిన విమాన సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఈ విమానాశ్రయం నిత్యం రద్దీగా ఉండే భారత విమానాశ్రయాల లో ప్రముఖమైనది.

Photo Courtesy: telugu native planet

రైలు మార్గం

రైలు మార్గం

బెంగళూరు మహానగరంలో రెండు ప్రధాన రైల్వే స్టేషన్ లు - ఒకటి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ గా, మరొకటి యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ గా ఉన్నాయి. మన ఏపీ కి, తెలంగాణ కి ఎక్కువగా యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు బయలుదేరుతాయి. ఇది దేశంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ లలో ఒకటి.

Photo Courtesy: Sherwin1995

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

బెంగళూరు నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి చక్కగా రోడ్డు మార్గాన్ని కలిగి ఉంది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, తిరుపతి వంటి నగరాలే కాక మరెన్నో నగరాల నుంచి ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల ద్వారా వేల సంఖ్యలో ప్రయాణీకులు వస్తుంటారు. బెంగళూరు లో ప్రధాన బస్ స్టాండ్ మెజేస్టిక్.

Photo Courtesy: Hayathkhan.h

లోకల్ సిటీ బస్సులు

లోకల్ సిటీ బస్సులు

బెంగళూరు మహానగరంలో మెజేస్టిక్ ప్రధాన బస్ స్టాండ్. దీనికి రోడ్డు ప్రక్కనే ఉన్న పెద్ద ప్రాంగణంలో సిటీలో తిరిగే లోకల్ బస్సులు అందుబాటులో ఉంటాయి అంతే కాక ప్రైవేట్ క్యాబ్ లు, ట్రావెలర్ వాహనాలు, ఆటో లు వంటి ప్రైవేట్ వాహనాలు కూడా ఉంటాయి.

Photo Courtesy: telugu native planet

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+