Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చిక్కబల్లాపూర్

చిక్కబల్లాపూర్ - మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మస్ధలం

15

కర్నాటకలో కొత్తగా ఏర్పడిన చిక్కబల్లాపూర్  జిల్లాకు హెడ్ క్వార్టర్స్ చిక్కబల్లాపూర్ పట్టణం. ఈ జిల్లా గతంలో కోలార్ లో ఒక భాగంగా ఉండేది. ఈ జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి.   చిక్కబల్లాపూర్ పట్టణం బెంగుళూరు నగరానికి షుమారు 50 కి.మీ. ల దూరంలో ఉంది. ఇది చిక్కబల్లాపూర్ జిల్లాకు ప్రధాన కేంద్రం. ఈ జిల్లా దేశవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ఇంజనీర్ శ్రీ విశ్వేశ్వరయ్య జన్మ స్ధలం. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముద్దెనహళ్ళి  విశ్వేశ్వరయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్  టెక్నాలజీ, శ్రీ సత్య సాయి బాబా యూనివర్శిటీ వంటి ఉన్నత విద్యా సంస్ధలతో విద్యారంగంలో ఈ జిల్లా బాగా అభివృధ్ధి చెందింది.

పట్టణ చుట్టు పక్కల ఆకర్షణలు చిక్కబల్లాపూర్ కు చుట్టుపట్ల ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలున్నాయి. వాటిలో సహజమైనవి కొన్ని కాగా మరి కొన్ని మనం నిర్మించినవి. ప్రఖ్యాత నంది హిల్స్ చిక్కబల్లపూర్ తాలూకాలో ఉంది.నంది హిల్స్ పైగల యోగ నందీశ్వర దేవాలయం, కొండ కిందిభాగంలో కల భోగ నందీశ్వర దేవాలయం ప్రధాన ఆకర్షణలు.   చిక్కబల్లపూర్ పట్టణానికి 12 కి.మీ. ల దూరంలో వివేకానంద జలపాతాలు కలవు. వర్షా కాలంలో ఈ ప్రదేశం జలపాతంతో ఎంతో అందంగా ఉంటుంది. చిక్కబల్లపూర్ సమీపంలోగల రంగస్ధల లో అందమైన దేవాలయం నల్లటి రాతితో నిర్మించబడి, సుందరమైన విజయనగర శిల్ప శైలిలో  శ్రీ మహా విష్ణువు విగ్రహం కలిగి ఉంటుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే గల ముద్దెన హళ్ళి శ్రీ విశ్వేశ్వరయ్య జన్మస్ధలం. నేటికి ఆయన నివాసం ఒక మ్యూజియంగా సంరక్షించబడుతోంది. చిత్రావతిలో సుబ్రమణ్యేశ్వర దేవాలయం, ఎల్లోడ్ లో శ్రీ లక్ష్మీ ఆదినారాయణ స్వామి దేవాలయం, కందవార సరస్సు లు కూడా ఆకర్షణీయ సమీప ప్రదేశాలు.

ఇక్కడకల కొన్ని కొండలు, పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. బెంగుళూరు నగరానికి దగ్గరగా ఉండటంతో చిక్కబల్లాపూర్ చేరాలంటే రవాణా సమస్యలుండవు. పర్యాటకులు రోడ్డు లేదా రైలు మార్గాలలో తేలికగా చేరవచ్చు.

చిక్కబల్లాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చిక్కబల్లాపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చిక్కబల్లాపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చిక్కబల్లాపూర్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి చిక్కబల్లాపూర్ కు ప్రయివేటు వాహనాలు, కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు తరచుగా నడుస్తాయి. ఎంతో సౌకర్యంగాను, తగిన ధరలలోను కూడా ఉంటాయి. టాక్సీలు, బైక్ లు లలో కూడా పర్యాటకులు ఇక్కడకు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - చిక్కబల్లాపూర్ కు రైలు స్టేషన్ కలదు. పట్టణం నుండి ఒక కిలో మీటర్ దూరంలో ఉంటుంది. అయితే, చిక్కబల్లాపూర్ కు ప్రధాన రైలు స్టేషన్ బెంగుళూరు రైలు స్టేషన్. ఇక్కడ నుండి దేశంలోని వివిధ నగరాలకు రైళ్ళు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    చిక్కబల్లాపూర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - చిక్కబల్లాపూర్ పట్టణం చేరాలంటే, దేశంలోని వివిధ నగరాలనుండి లేదా విదేశాలనుండి పర్యాటకులు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంద్వారా చేరవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం చిక్కబల్లాపూర్ కు 48 కి.మీ. ల దూరంలో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue