Search
  • Follow NativePlanet
Share
» »ఆనందించాల్సిన అయిదు క్రీడలు!

ఆనందించాల్సిన అయిదు క్రీడలు!

ఇండియా లో, మీ సెలవులను ఆనందించటానికి కూర్గ్ ప్రదేశాన్ని ప్రసిద్ధ ఉత్తమ ప్రదేశాలలో ఒకటిగా చెపుతారు. దట్టమైన పచ్చని తేయాకు తోటలు,కాఫీ ఎస్టేట్ లు, ఎగుడు దిగుడు పర్వత శ్రేణులు, ఎగిసిపడే జలపాతాలు వంటి సహజ ఆకర్షణలతో కూర్గ్ మీరు ఆశించే పూర్తి విశ్రాంతిని అందిస్తుంది. స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియా గా పిలువబడే కూర్గ్ మీకు సైట్ సీఇంగ్ మాత్రమే కాదు, ఎన్నో సాహస క్రీడలు కూడా అందిస్తుంది.

రివర్ రాఫ్టింగ్
కూర్గ్ లో కల రివర్ రాఫ్టింగ్ ఎంతో సవాలుతో కూడిన సాహస క్రీడా. రివర్ రాఫ్టింగ్ కు ఇక్కడి ప్రదేశాలు ఎంతో సహజంగా వుంది మీకు లైఫ్ టైం అనుభవాలు కలిగిస్తాయి. బారా పోల్ జలపాతాలు కూర్గ్ లో ప్రసిద్ధి చెందిన రాఫ్టింగ్ ప్రదేశాలు.

మీరు కనుక కొత్తగా రాఫ్టింగ్ చేసే వారైతే, ఇక్కడ మీరు ఒక గైడ్ సహాయం తప్పక తీసుకోవాలి. సాధారణంగా, ప్రధాన రాఫ్టింగ్ ప్రదేశాలలో శిక్షణ పొందిన గైడ్ లు వుంటారు. వారి పర్యవేక్షణలో మీరు అద్భుత ఆనందాల రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు.

ఎలిఫెంట్ సఫారి
ఒక ఏనుగుపై అడవిలో పర్యటించడం ఒక సాహస కార్యం. అయితే, పక్కనే అనుభవజ్ఞులైన గైడ్ లు వుండగా ఒక ఏనుగుపై కూర్చొని ఆడవి పర్యటన చేయడం చాలా తేలిక. కూర్గ్ అడవులలో ఈ ఎలిఫెంట్ సఫారీ లు అమితంగా ఆనందించవచ్చు. ఇక్కడ కల దుబారే ఎలిఫెంట్ క్యాంపు లో ఈ రకమైన ఆనందాలకు అవసరమైన సౌకర్యాలు కలవు. ఇక్కడ మీరు ఏనుగులకు ఆహారం కూడా అందించవచ్చు. మావటి వారి పర్యవేక్షణలో ఏనుగులు అనేక విన్యాసాలు చేయటం చూడవచ్చు.

కూర్గ్ లో ట్రెక్కింగ్
దీర్ఘ నడకలు చేయాలనుకునే వారికి ఇక్కడ కల పొగ మంచుతో నిండిన కొండలు, చుట్టూ కల పచ్చదనం, వాటర్ ఫాల్స్, ప్రవాహాలు అన్నీ కలసి మిమ్మల్ని అందమైన, ఆహ్లాదకరమైన మరొక ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. ట్రెక్కింగ్ ప్రియులు ఇక్కడి వాలీ లలో ట్రెక్కింగ్ చేస్తూ, పక్షుల ధ్వనులు, చల్లటి గాలులు, జలపాత ధ్వనులు ఆనందించవచ్చు. ది నాగర్ హోల్ నేషనల్ పార్క్, అబ్బే ఫాల్స్, ఇరుప్పు ఫాల్స్, వంటి ప్రదేశాలు ట్రెక్కింగ్ ప్రియులకు ఎంతో థ్రిల్లింగ్ గా వుంటాయి.

కూర్గ్ తోటల ఖుషీ జీవనం!

కాలి నడకలు
మీరు కనుక నగర జీవనంలో విసిగిన వారైతే, మీకు ఇక్కడి విస్తృతమైన పచ్చటి టీ మరియు కాఫీ తోటలు తాజా అనుభూతు లను అందిస్తాయి. నగర జీవిత అలసటను తొలగిస్తాయి. కాలి నడకన బయలు దేరి, ఒక్క సారి చుట్టి వస్తే చాలు ఎంతో తాజాగా, రిలాక్స్ గా భావిస్తారు. ఇక్కడ కల కాఫీ, టీ ఎస్టేట్ ల యజమానులతో మీరు సంభాషించవచ్చు.

చేపలు పట్టుట
కూర్గ్ లో అనేక ఫిషింగ్ క్యాంపు లు కలవు. వీటిలో మీరు ప్రకృతిని ఆనందిస్తూ, రిలాక్స్ గా చేపలు పట్టి ఆనందించవచ్చు. ఇక్కడ కల వల్నూర్ ఫిషింగ్ క్యాంపు కర్ణాటకలో ప్రసిద్ధి చెందినా ఫిషింగ్ ప్రదేశం. ఈ ఫిషింగ్ క్యాంపు ను ప్రకృతి దృశ్యాల నడుమ అందంగా అమర్చారు.

పైన తెలిపిన క్రీడలను ఆనందించేందుకు కూర్గ్ ఒక మంచి ప్రదేశం. అక్కడకల వాతావరణం తో ప్రతి కాలంలోనూ మీరు ఇక్కడ ఆనందించవచ్చు. ప్రత్యేకించి అవుట్ డోర్ క్రీడలకు అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలు ఉత్తమమైనవి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+