రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబూ ఒక వేసవి విడిది (పర్వత ప్రాంతం). ప్రకృతి సౌందర్యం, సౌకర్యవంతమైన వాతావరణం, పచ్చటి కొండలు, దివ్యమైన సరస్సులు, అందంగా నిర్మించిన ఆలయాలు, అనేక ధార్మిక కేంద్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. పురాణాల్లోమౌంట్ అబూ -సర్ప దేవత అర్బుద పేరిట ఈ ప్రాంతాన్ని అర్బుదారణ్య అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుని వాహనమైన నందిని రక్షించడానికి సర్పదేవత కిందికి వచ్చాడు. తర్వాతి కాలంలో ‘అర్బుదారణ్య' పేరు ‘అబూ పర్వత' లేదా ‘మౌంట్ అబూ' గా మారింది. ఇక్కడ గుర్జర్లు లేదా గుజ్జర్లు నివసించేవారని, వారికీ అర్బుద పర్వతాలతో అనుబంధ ముండేదని ఈ ప్రాంతానికి చెందిన చారిత్రిక గ్రంధాలు, శాసనాలలో నమోదు చేయబడింది.

తీర్థ యాత్ర స్థలం
జైనులకు ఈ ప్రాంతం ఒక ప్రముఖ తీర్థ యాత్ర స్థలం. 1220 మీ. ఎత్తు లో గల ఈ పర్వత కేంద్రం ఆరావళి పర్వత శ్రేణుల లోని ఎత్తైన శిఖరం మీద నెలకొని వుంది. మౌంట్ అబూ ప్రముఖ చరిత్ర, పురాతన పురాతత్వ ప్రాంతాలు, అధ్భుతమైన వాతావరణం కల్గి ఉండటం వలన రాజస్థాన్ లోని అతి పెద్ద పర్యాటక ఆకర్షణ లలో ఒకటిగా పరిగణింపబడుతున్నది.

వేసవి విడిది
ప్రధానంగా వేసవికాలం, వర్షా కాలంలో వేలాదిమంది పర్యాటకులు, భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. గత దశాబ్ద౦లొ ఈ పర్వత కేంద్రం ఒక ప్రముఖ వేసవి విడిదిగాను, హనీ మూన్ గమ్యస్థానంగా ప్రజాదరణ పొందింది. సాయం వేళ అరుణ కాంతుల సూర్యాస్తమయం దృశ్యం

స్పిరిట్యువల్ యూనివర్సిటీ, మౌంట్ అబు
మౌంట్ అబూ లో గల ది బ్రహ్మ కుమరీస్ స్పిరిట్యువల్ యూనివర్సిటీ ప్రపంచ ప్రసిద్ధ సామాజిక అధ్యాత్మిక విద్య సంస్థ. ఈ విశ్వవిద్యాలయం బ్రహ్మ కుమరీస్ వాల్డ్ స్పిరిట్యువల్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. దీనిని సార్వత్రిక శాంతి, సోదర భావాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో1936 లో ఏర్పాటు చేశారు. ధ్యానం, యోగ, ఆధ్యాత్మిక వంటి అనేక విద్యలను ఈ విశ్వవిద్యాలయం లో బోధిస్తారు. ది బ్రహ్మ కుమరీస్ స్పిరిట్యువల్ యూనివర్సిటీ 132 దేశాలలో 8500 కేంద్రాలను కల్గి ఉంది.
Image source: www.wikipedia.org

పురాణాల్లోమౌంట్ అబూ
సర్ప దేవత అర్బుద పేరిట ఈ ప్రాంతాన్ని అర్బుదారణ్య అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుని వాహనమైన నందిని రక్షించడానికి సర్పదేవత కిందికి వచ్చాడు. తర్వాతి కాలంలో ‘అర్బుదారణ్య' పేరు ‘అబూ పర్వత' లేదా ‘మౌంట్ అబూ' గా మారింది. ఇక్కడ గుర్జర్లు లేదా గుజ్జర్లు నివసించేవారని, వారికీ అర్బుద పర్వతాలతో అనుబంధ ముండేదని ఈ ప్రాంతానికి చెందిన చారిత్రిక గ్రంధాలు, శాసనాలలో నమోదు చేయబడింది.
ఆధ్యాత్మిక అద్భుతం !
Image source: www.wikipedia.org

చూడ దగిన ప్రదేశాలు.
నక్కి సరస్సు, సన్సెట్ పాయింట్, టోడ్ రాక్, ది సిటీ అఫ్ అబూ రోడ్, ది గురు శిఖర్ పీక్, మౌంట్ అబూ వన్యప్రాణి అభయారణ్యం ఈ ప్రాంత౦లొ చూడవలసిన ప్రధాన ఆకర్షణలు. అనేక చారిత్రక, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన ప్రాంతాలలో ప్రధానంగా దిల్వార జైన దేవాలయాలతో బాటుగా అధర్ దేవి ఆలయం, దూద్ బవోరి, శ్రీ రఘునాథ్ జి దేవాలయం, అచల్ ఘర్ కోట వంటి ప్రాంతాలు కూడ మౌంట్ అబూ లో వున్నాయి.
Image source: www.wikipedia.org

నక్కి సరస్సు
పర్యాటకులు, స్థానిక ప్రజలు సందర్శించే నక్కి సరస్సు మౌంట్ అబూ లోని ఒక ప్రముఖ ఆకర్షణ. ఇది 1200 మీ. ఎత్తు లో నున్న భారతదేశపు ఒకే ఒక్క కృత్రిమ సరస్సు. ఇది సుందరమైన కొండల నడుమ వున్న ఒక అందమైన నిర్మలమైన ప్రదేశం క్రూరులైన రాక్షసుల బారి నుండి తమను తాము కాపాడు కోవడానికి దేవతలు తమ నఖాలు (గోర్లు) తో ఈ సరస్సు ను తవ్వారని, అందువలననే దీనికి ఆ పేరు వచ్చిందని పురాణాలలో తెలుపబడింది. వేరొక పురాణ గాథ ప్రకారం దిల్వార జైన దేవాలయాల శిల్పి రసియ బాలం దీనిని ఒక్క రాత్రి లోనే తవ్వాడు. మహాత్మాగాంధీ స్మారకార్థం నిర్మించిన గాంధీ ఘాట్ ను కూడా పర్యాటకులు సందర్శించవచ్చు.
Image source:commons.wikimedia.org

పర్వతారోహణ
పర్వతారోహణ చేయాలనుకునే పర్యాటకులు, సాహస ప్రియులకు ఈ సరస్సు దగ్గర లోని అనేక రాతి కొండలు ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. నక్కి లేక్ వద్ద ఉన్నప్పుడు బోటింగ్ చేస్తూ ఈ సరస్సు లోని స్వచ్చమైన ప్రశాంతమైన నీటిని ఆస్వాదించగలగడ౦ ఇంకొక ఆసక్తి కరమైన అంశం.
Image source: www.wikipedia.org

సన్ సెట్ పాయింట్
నక్కి లేక్ కు ఆగ్నేయ దిక్కున గల సన్ సెట్ పాయింట్ మౌంట్ అబూలోని ఒక ప్రసిద్ధ సాయంత్రపు ఆకర్షణ. అందమైన కొండల నేపధ్యంలో గల ఈ ప్రదేశం సూర్యాస్తమయ సమయంలో సమగ్రమైన మనోహర దృశ్యాలతో ఆనందాన్ని కల్గిస్తుంది. ఈ ప్రాంతపు చల్లటి పరిసరాలలో విశ్రాంతి కోరుకొంటూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుండడంవల్ల ఈ ప్రాంతం వేసవి కాలం లో ఒక ప్రసిద్ధ పర్యటక ఆకర్షణగా మారింది.
Image source:www.wikipedia.org

దిల్వార జైన దేవాలయాలు
11 వ శతాబ్దం, 13 వ శతాబ్దం లో నిర్మించిన దిల్వార జైన దేవాలయాలు తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ దేవాలయాలు తెల్లటి పాలరాయితో అందంగా చెక్కారు. ఈ దేవాలయాలలో అధ్భుతంగా చెక్కిన ఐదు జైన దేవాలయాలు వున్నాయి, ఇవి మొత్తం రాజస్థాన్ లోని అత్యంత అందమైన దేవాలయాలుగా పేరు పొందాయి.
Image source: www.wikipedia.org

దేవాలయాలు
రాజస్థాన్ లోని ఐదు గ్రామాల పేరిట ఏర్పడ్డ ఈ దేవాలయాలు ఒక దాని నుండి మరొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. విమల్ వసహి దేవాలయం, లున వసహి దేవాలయం, పీతాల్ హర్ దేవాలయం, ఖర్తర్ వసహి దేవాలయం, శ్రీ మహావీర్ స్వామి దేవాలయం అనేవి ఈ ఐదు దేవాలయాలు. తమ తీర్థంకరులను (యోగులు) పూజించడానికి పెద్దసంఖ్యలో జైన భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ దేవాలయాల అధ్భుత నిర్మాణ శైలిని చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు.ఈ దేవాలయాల గురించి మరింత తెలుసుకునేందుకు అద్దె చెల్లించి టూరిస్ట్ గైడ్ ల సేవలను పొందవచ్చు. మౌంట్ అబూ నుండి రెండున్నర కి. మీ. దూరంలో గల దిల్వార దేవాలయాలను రోడ్డు ప్రయాణం ద్వారా చేరవచ్చు.
Image source: www.wikipedia.org

కళాకృతుల దుకాణాలు
ఈ దగ్గరలోని హనీమూన్ పాయింట్ లో గల కళాకృతుల దుకాణాలు, ఆహార శాలలలో ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతంలో చిన్న చెక్క విగ్రహాలు,చిన్న చిన్న బొమ్మలు, ఆట వస్తువుల వంటి కళాకృతుల ను పర్యాటకులు కొనుగోలు చేయవచ్చు.
Image source:www.wikipedia.org

మౌంట్ అబూ చేరుకోవడం
మౌంట్ అబూ కు చక్కటి రోడ్డు, రైలు, విమాన సౌకర్యం ఉంది. 185 కి. మీ.ల దూరంలో గల ఉదయ్ పూర్ నుండి వాయు మార్గం ద్వార పర్యాటకులు ఇక్కడికి చేరవచ్చు. సంవత్సరం పొడవున వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వేసవి కాలం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది.
Image source: www.wikipedia.org



Click it and Unblock the Notifications














