Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోని టాప్ 50 హోట‌ల్ బాబితాలో.. అమ‌ర్‌విలాస్‌

ప్రపంచంలోని టాప్ 50 హోట‌ల్ బాబితాలో.. అమ‌ర్‌విలాస్‌

ప్రపంచంలోని టాప్ 50 హోట‌ల్ బాబితాలో.. అమ‌ర్‌విలాస్‌

భార‌త‌దేశంలోని ప్ర‌తి ప్యాలెస్‌లో, ప్రతి కోటలో ప్రతిచోటా భారతదేశ సంస్కృతులు, చరిత్ర, చారిత్రక కథలను చూడొచ్చు. దేశ సంస్కృతిని చూసేందుకు ఎంతో మంది విదేశీయులు సైతం ఇక్కడికి పెద్ద సంఖ్యలో త‌ర‌లి వస్తుంటారు. భారతదేశం పర్యాటకులకు గొప్ప ప్రదేశం అనడంలో సందేహం లేదు. ఈ కారణంగానే, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల సంఖ్యను పెంచడానికి భారతదేశం నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సంస్కృతితో పాటు ప్రజలకు గొప్ప ఆతిథ్యాన్ని అందించే కొన్ని హోటళ్లు ఇక్క‌డ అనేకం ఉన్నాయి. ఇక్క‌డి హోట‌ళ్ల‌లో రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో పాటు అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను కూడా అందుబాటులో ఉంటాయి. ప్ర‌త్యేకంగా భారతదేశంలోని కొన్ని హోటళ్లు ప్రతి ఏటా ప్రపంచంలోని అత్యుత్తమ హోటళ్ల జాబితాలో నిలుస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ 5 స్టార్ అమరవిలాస్ హోటల్ పేరు కూడా చేర్చబడింది. ఇది జాబితాలో 45వ స్థానం పొందింది. ఈ హోటల్‌లోని కొన్ని సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1

హోటల్ ఒబెరాయ్ గ్రూప్‌కు చెందినది

theworldsbest.com నిన్న లండన్‌లో ప్రపంచంలోని టాప్ 50 హోటళ్ల జాబితాను విడుదల చేసింది. ఒబెరాయ్ గ్రూప్ ఆగ్రా ఆధారిత హోటల్ అమర్ విలాస్ కూడా ఈ జాబితాలో చేర్చబడింది. 2004లో ఇండియా-పాకిస్థాన్ సమ్మిట్ సందర్భంగా ఈ హోటల్ చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఈ హోటల్‌ అమర్‌ విలాస్‌లో బస చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ హోటళ్ల జాబితాలో 5 స్టార్ అమరవిలాస్ హోటల్ పేరు కూడా ఉంది. ఈ హోట‌ల్ ఒబెరాయ్ గ్రూప్‌కు చెందిన‌ది. ఇది ఇప్పుడు అత్యుత్త‌మ హోట‌ల్ జాబితాలో 45 వ స్థానం పొందింది.

హోటల్ సౌకర్యాలు

ఆగ్రాలో 5 స్టార్ అమరవిలాస్ హోటల్ ఉంది. ఈ హోటల్‌లోని ప్రతి గది తాజ్ మహల్ అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. హోటల్ గోడల ఆలోచన కూడా దాదాపు మొఘలుల నుండి ప్రేరణ పొందిన‌వే. హోటల్‌లో మొత్తం 102 గదులు ఉండగా, వాటితో పాటు అతిథులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. గదిలో కింగ్ సైజ్ బెడ్ నుండి ఫౌంటెన్ వీక్షణ వరకు అన్నీ ఉన్నాయి.

2

హోటల్ అద్దె వివ‌రాలు ..

అమరవిలాస్ హోటల్‌లో ఒకరోజు బసకు రూ.40 వేలు ఖ‌ర్చువుతుంది. అల్పాహారం ఉన్న హోటల్ అయితే దాని కోసం రూ. 212,000 చెల్లించాలి. విందుతో క‌లిపి అయితే ఇద్దరు వ్యక్తులకు సుమారు రూ.13 వేలు ఉంటుంది.

3

హోటల్ చేరుకోవడం ఎలా

ఈ హోటల్ తాజ్ మహల్ నుండి సుమారు 600 మీటర్ల దూరంలో ఉంది. ఈ హోటల్ బాల్కనీ నుండి ప్రపంచంలోని ఏడవ‌ అద్భుతమైన తాజ్‌మ‌హ‌ల్‌ను అందాల‌ను వీక్షించొచ్చు. ఢిల్లీ నుండి ఆగ్రాకు బస్సులో ప్రయాణించడానికి సుమారు ఐదు నుంచి ఆరు గంట‌ల స‌మ‌యం పడుతుంది. ఇక‌, అదే రైలు మార్గం ద్వారా అయితే ఆగ్రా నుండి వెళ్లొచ్చు. అక్క‌డి నుండి రెండు మూడు గంట‌లు పడుతుంది. స్లీపర్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో టికెట్ కోసం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ కోచ్ అయితే రూ. 500 చెల్లించాలి.

More News

    Read more about: agra delhi
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+